Bodhan: బోధన్‌లో మోదీ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం.. ధరలు తగ్గించకుంటే జైల్ భరో!

Bodhan: నిజామాబాద్ జిల్లా బోధన్‌లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా సీపీఐ ఎంఎల్ ప్రజా పంథా ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం.

K RAVI, BODHAN
Published on: 17 May 2026 9:59 PM IST
Bodhan
X

Bodhan: బోధన్‌లో మోదీ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం.. ధరలు తగ్గించకుంటే జైల్ భరో!

నిజామాబాద్ జిల్లా: బోధన్ పట్టణంలో సిపిఐ ఎంఎల్ ప్రజా పంత్ ఆధ్వర్యంలో ఆదివారం కేంద్ర ప్రభుత్వ తీరు కు నిరసనగా నిరసన వ్యక్తం చేశారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలతో పాటు గ్యాస్, వంటనూనెలపై ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ప్రజా పంత్ బోధన్ డివిజన్ కార్యదర్శి మల్లేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడంతోపాటు నిత్యాసర ధరలు పెంచి సామాన్యులపై అధిక భారం మోపిందని మండిపడ్డారు. యుద్ధం అడ్డుపెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచి ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. పెంచిన తర్వాత తగ్గించకపోతే సిపిఐ ఎంఎల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN

Next Story