Bodhan: ఘనంగా బీఆర్ఎస్ ఇంచార్జ్ ఆయేషా ఫాతిమా అమెర్ జన్మదిన వేడుకలు
Bodhan: బోధన్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జ్ ఆయేషా ఫాతిమా జన్మదినం సందర్భంగా పేద విద్యార్థులకు యూనిఫాంలు, స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు.
Bodhan: ఘనంగా బీఆర్ఎస్ ఇంచార్జ్ ఆయేషా ఫాతిమా అమెర్ జన్మదిన వేడుకలు
బోధన్: బోధన్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి అయేషా ఫాతిమా అమెర్ గారి జన్మదినం సందర్భంగా విద్యార్థులకు గిఫ్ట్లు నావెల్టీలను శనివారం అందజేశారు. బోధన్ మండలం అందాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆయేషా జన్మదినం సందర్భంగా పాఠశాలలో భారీగా ఏర్పాట్లు చేసి కేకును కట్ చేయించారు.
పేద విద్యార్థుల మధ్య తన జన్మదిన వేడుకలు జరుపుకోవడం జీవితంలో మర్చిపోలేనని అనుభూతి కలిగించిందని " అయేషా పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులను తన ట్రస్టు ద్వారా ఆదుకుంటానని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్దాపూర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థి విద్యార్థినీ లకు 300 స్కూల్ యూనిఫామ్స్, 100 స్కూల్ బ్యాగ్స్ అందజేయడం జరిగింది.
జిల్లా ఆసుపత్రిలో బాధితులకు పండ్లను అందజేశారు. అలాగే చింతకుంట అనాథ ఆశ్రమంలో వృద్ధులకు నూతన వస్త్రాలు అందజేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్, మండల అధ్యక్షులు నర్సన్న, సంజీవ్, శ్రీరామ్, భూమా రెడ్డి, నర్సింగ్ రావు కౌన్సిలర్లు మౌబీన్, ముషీర్ బాబా, అశోక్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, తోట శ్రీనివాస్, శంకర్ గౌడ్, గణేష్, నరేష్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు




