Armoor: ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చిత్రపటానికి బీజేపీ పాలాభిషేకం!

Armoor: ఆర్మూర్ మున్సిపాలిటీ నూతన భవనానికి రూ.7.50 కోట్లు మంజూరు. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చిత్రపటానికి బీజేపీ ఆధ్వర్యంలో పాలాభిషేకం.

VAMSHI, ARMOOR
Published on: 12 Sept 2026 4:54 PM IST
Armoor
X

Armoor: ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చిత్రపటానికి బీజేపీ పాలాభిషేకం!

Armoor: ఆర్మూర్ పట్టణ శాఖ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చిత్రపటానికి అంబేద్కర్ చౌరస్తా వద్ద పాలాభిషేకం.

బిజెపి పార్టీ పట్టణ అధ్యక్షుడు మాట్లాడుతూ ఈ సందర్భంగా బిజెపి పార్టీ పట్టణాధ్యక్షుడు మందుల బాలు మాట్లాడుతూ ఆర్మూర్ అభివృద్ధి ప్రతాక హిందూ టైగర్ డైనమిక్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ప్రతి సారి అసెంబ్లీ సమావేశంలో అనర్గళంగా నియోజవర్గం అభివృద్ధి ఎన్నోసార్లు కోట్లాడుతూ , గతంలో ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే గల్ఫ్ బాధితుల పట్ల నిలబడి యావత్ తెలంగాణ కుటుంబాలకు, ఒక అండగా ఆశాజ్యోతి గా నిలిచిన ఘనత మన పైడి రాకేష్ రెడ్డి, పట్టణ అభివృద్ధి కోసం ఎన్నోసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రికి, జిల్లా మంత్రులకు అప్లికేషన్స్ ఇస్తూ, వాళ్లని కంటిన్యూగా కలుస్తూ అభివృద్ధి కోసం నిత్యం నిద్రలేకుండా సేవ చేయడమే లక్ష్యం అంటున్న ఎమ్మెల్యే, నిన్నటి నిన్న సాయంత్రం మన ఆర్మూర్ మున్సిపాలిటీకి నూటన భవనం కొరకు ఏడు కోట్ల, 50 లక్షల రూపాలని మంజూరు చేయించిన ఘనత మన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి , ఇమిడియెట్ గా సాంక్షన్ చేయించడం జరిగిందంటూ కార్యక్రమం లో విలేకరులతో మాట్లాడు.

కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజవర్గానికి నిధులు మేమిచ్చినం, మేమే తెస్తున్నాం,అంటున్న మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు:

ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇంకా బ్రమలో, కలలు కంటూనే ఉన్నారు, మన నియోజవర్గం కోసం , అసెంబ్లీలో, బయట మీడియాతో ఎవరు మాట్లాడుతుందో, మన నియోజకవర్గ ప్రజలే కాకుండా,యావత్ తెలంగాణ ప్రజలు టీవీల్ లో పేపర్ లో చూస్తున్నారు ఎవరేం మాట్లాడుతున్నారంటూ, మా పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధి నా లక్ష్యమంటూ, పలుసార్లు అసెంబ్లీ సమావేశంలో మాట్లాడడం జరిగింది.

మా ఎమ్మెల్యేకు నిత్యం ఇంకా నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఉన్నాడంటూ ఈ సభాముఖంగా గౌరవంగా చెప్పడం జరిగింది, ఇకనైనా కాంగ్రెస్ పార్టీ చైర్మన్, కౌన్సిలర్లు, మీకు అన్ని తెలిసి కూడా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, మీ మాట తీరు మార్చుకోవాలి, ఈరోజు మన మున్సిపాలిటీ కార్యాలయం , ఏ రకంగా ఉందో మీకు అందరు తెలిసిన విషయమే, దాని కొరకు జిల్లా మంత్రులను, రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా కలుస్తూ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది, సుమారు ఏడు కోట్ల 60 లక్షల రూపాయలు మున్సిపల్ నిర్మాణం కోసం ఇవ్వడం జరిగింది, మన ఆర్మూర్ ప్రజలకు ఇది చాలా గర్వకారణం, ఇంకా ఎలాంటి అభివృద్ధి కోసం ఆయన మా ఎమ్మెల్యే చేయడానికి రెడీ ఉన్నారు, నిత్యం నియోజవర్గ ప్రజలకు 24/7 పనిచేస్తూనే ఉంటాడు, కాబట్టి ఏ విషయమైనా అని ఆలోచించి మాట్లాడాలి, ఇస్తాను సారంగా మాట్లాడి నోరులు జారుకోవద్దని , ఈ కార్యక్రమం లో విలేకరుల ద్వారా చెప్పడం జరిగింది.

ఆర్మూర్ నియోజవర్గ బిజెపి, కౌన్సిలర్లు, నాయకులు, వివిధ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు, రాష్ట్ర కిషన్ మోర్చా ఉపాధ్యక్షుడు నూతల శ్రీనివాస్ రెడ్డి, బిజెపి కౌన్సిలర్లు, బొట్టు రాజు, శ్రావణ్, కవిత - ఈశ్వర, యామాద్రి భాస్కర్,అరుణ్, బిజెపి జిల్లా కార్యదర్శి పోల్కం వేణు,బిజేవైఎం పట్టణ అధ్యక్షుడు ఉదయ్ గౌడ్, బీజేవైఎం జిల్లా నాయకుడు కలిగొట్టు ప్రశాంత్, బిజెపి సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

VAMSHI, ARMOOR

VAMSHI, ARMOOR