Kamareddy: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి: బీజేపీ!
Kamareddy: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా మద్నూర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, నిరసన చేపట్టారు.
Kamareddy: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి: బీజేపీ!
కామారెడ్డి: కామారెడ్డి మద్నూర్ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న విద్యార్థులఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మద్నూర్ మండల శాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. ఈసందర్భంగా బీజేపీనాయకులు మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్,స్కాలర్‌షిప్‌లుఅందకవిద్యార్థులు,వారికుటుంబాలుతీవ్రఇబ్బందులుఎదుర్కొంటున్నారనిఅన్నారు.
ప్రభుత్వంవెంటనేపెండింగ్ బకాయిలను విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ మద్నూర్ మండల అధ్యక్షుడు తెప్పవార్ తుకారాం,జనరల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రశాంత్, సర్పంచ్ మాధవ్,హన్మండ్లు లక్ష్మణ్ పటేల్, జ్ఞానేశ్వర్, నరేష్, శివకుమార్,కిసాన్ మోర్చా నాయకులు కంచిన్ యాదవ్,రమేష్ దేశాయ్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




