Banswada: రుద్రూరులో బీఆర్ఎస్‌లోకి బీజేపీ, కాంగ్రెస్ నేతల చేరిక!

Banswada: కామారెడ్డి జిల్లా రుద్రూర్ మండలంలో కేసీఆర్ అభివృద్ధి పనులకు ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్‌లో చేరారు.

SALEEM, BANSWADA
Published on: 6 Sept 2026 12:53 PM IST
Banswada
X

Banswada: రుద్రూరులో బీఆర్ఎస్‌లోకి బీజేపీ, కాంగ్రెస్ నేతల చేరిక!

Banswada: రుద్రూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్తపల్లి రవి కిరణ్ ఆధ్వర్యంలో ఆదివారం బీజేపి, కాంగ్రెస్ పార్టీల నుండి బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. బీజేపి పార్టీ నుండి రుద్రూర్ మండలం బొప్పాపూర్ గ్రామ అధ్యక్షులు నారోజి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నుండి తగ్గేల్లి కిరణ్, బొమ్మిడి పాపయ్యలు బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొత్తపల్లి రవికిరణ్ బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి రవికిరణ్ మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అందించారాని, కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీలోకి చేరారని ,పార్టీ బలోపేతం కోసం అందం కలిసి పని చేద్దాం అన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నితిన్ పటేల్, నరేందర్, సాయిలు, యువజన నాయకులు జువ్వల శ్రావణ్, సిరిగిరి శేఖర్, టింకు గౌడ్, సుమన్, గుండ్ల మధు, పట్ల శ్రీకాంత్, పట్ల సంతోష్ పటేల్, సయ్యద్ కిజర్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA

Next Story