Birkur: బరంగేడ్గిలో భక్తిశ్రద్ధలతో పద్మశాలి సంఘం బోనాలు

Birkur: బీర్కూర్ మండలం బరంగేడ్గిలో ఘనంగా బోనాల పండుగ. పద్మశాలి సంఘం ఆడపడుచులు పోచమ్మ అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు.

SALEEM, BANSWADA
Published on: 28 July 2026 10:00 PM IST
Birkur
X

Birkur: బరంగేడ్గిలో భక్తిశ్రద్ధలతో పద్మశాలి సంఘం బోనాలు

బీర్కూర్: బోనాల పండుగను పురస్కరించుకుని బీర్కూర్ మండలంలోని బరంగేడ్గి గ్రామంలో మంగళవారం పద్మశాలి సంఘానికి చెందిన ఆడపడుచులు భక్తిశ్రద్ధలతో బోనం ఎత్తి గ్రామంలోని పోచమ్మ అమ్మవారికి సమర్పించారు.సాంప్రదాయ వస్త్రధారణలో మహిళలు మంగళవాయిద్యాల నడుమ, భక్తి గీతాలు ఆలపిస్తూ ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం అమ్మవారికి బోనం సమర్పించి గ్రామంలో సుఖశాంతులు నెలకొనాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వర్షాలు సమృద్ధిగా కురవాలని భక్తిపూర్వకంగా ప్రార్థించారు.ఈ సందర్భంగా పద్మశాలి సంఘ సభ్యులు మాట్లాడుతూ బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు.

ప్రతి సంవత్సరం ఇదే విధంగా అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలుస్తూ గ్రామ శ్రేయస్సు కోసం ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘ సభ్యులు దీకొండ రమేష్,రచ్చ ఆంజనేయులు,గాజుల పండరి, సాయినాథ్, అన్న ఆంజనేయులు, బేతి పోశెట్టి, గాజుల గణేష్, రచ్చ సురేష్, గాజుల సాయిలు, గాజుల శ్రీనివాస్అ, న్నం ముత్తయ్య,అంకం దేవదాస్, అన్నం సాయిబాబా, అన్నం ప్రభు,అన్నం వెంకయ్య, అన్నం రమేష్, మరియుమహిళలు, యువతులు, చిన్నారులు, గ్రామ పెద్దలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA

Next Story