Birkur: మంజీరా చెక్ డ్యామ్‌కు ప్రత్యేక పూజలు చేసిన నాయకులు
Birkur: బీర్కూర్ మంజీరా నదిపై రూ. 32 కోట్లతో నిర్మించిన చెక్ డ్యామ్ పొంగిపొర్లడంతో గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు. రైతన్నల్లో హర్షాతిరేకాలు.
Birkur: మంజీరా చెక్ డ్యామ్‌కు ప్రత్యేక పూజలు చేసిన నాయకులు
బీర్కూర్: శివారులోని మంజీరా నదిపై రూ. 32 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన చెక్ డ్యామ్ పూర్తి అయిన నెల రోజుల వ్యవధిలోనే, గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా భారీగా నీరు చేరి పొంగిపొర్లుతుండడంతో, స్థానిక నాయకులతో కలిసి చెక్ డ్యామ్‌ను సందర్శించారు. అనంతరం బ్రిడ్జి పైనుండి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పోచారం దూరదృష్టితో మంజీరా నదిపై నిర్మించిన చెక్ డ్యామ్ పొంగిపోర్లడంతో పరిసర ప్రాంతాల రైతులకు సాగునీటి లభ్యత పెరగడంతో పాటు భూగర్భ జలాలు కూడా గణనీయంగా పెరుగుతాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Next Story




