Bichkunda: మారుతున్న విద్యారంగం.. టీచర్లకు 'ఏఐ' బోధనా పద్ధతులపై అవగాహన!
Bichkunda: కామారెడ్డి జిల్లా బిచ్కుందలో ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా 'టీచర్ 5.0' ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఆదివారం విజయవంతంగా ముగిసింది.
Bichkunda: మారుతున్న విద్యారంగం.. టీచర్లకు 'ఏఐ' బోధనా పద్ధతులపై అవగాహన!
బిచ్కుంద: బిచ్కుంద ప్రస్తుత విద్యారంగంలో ఉపాధ్యాయుల భోధన నైపుణ్యలను ఆధునిక అవసరాలకు అనుగుణంగా మెరుగుపర్చడం లక్ష్యంగా 'ప్రొమైండ్స్ స్కిల్ క్యాటలిస్ట్ 'ఆధ్వర్యంలో నిర్వహించిన 'టీచర్ 5.0. ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఆదివారం బిచ్కుంద పట్టణంలో విజయవంతంగా ముగిసింది.
స్థానిక స్కాలర్ హై స్క్యూల్ ఉపాధ్యాయులకు ప్రొమైండ్స్ కార్యాలయం లో రెండు గంటలపాటు శిక్షణ అందించారు. కార్యక్రమం లో ప్రొమైండ్స్ పౌండర్ కె. గంగాధర్ రిషోర్స్ పర్సన్ గా పాల్గొని ఉపాధ్యాయులకు మార్గానిర్దేశనం చేశారు. మారుతున్న విద్య విధానానికి అనుగుణంగా ఉపాధ్యాయులు నిరంతరం నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవార్చుకోవాల్సిన అవసరం ఉందని అయన పేర్కొన్నారు.
శిక్షణలో ఆధునిక భోధన పద్ధతులు, 21 వ శతబ్దపు నైపుణ్యాలు, తరగతి గది నిర్వహణ, కృత్రిమ మేధస్సు (AI) వినియోగం, విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపోందించే విధానాలపై ప్రాక్టీకల్ శేషన్లు, గ్రూప్ డిస్కషన్ల ద్వారా అవగాహన కల్పించారు. భోధనను మరింత ఆసక్తి కరంగా,ఫల ప్రధంగా తీర్చిదిద్దే పద్ధతులను ఉపాధ్యాయులకు వివరించారు.
కార్యక్రమం లో మొత్తం 20మంది ఉపాధ్యాయులు ఉత్సహం గా పాల్గొన్నారు. కార్యక్రమం విజయంతమవ్వడానికి సహకరించిన స్కాలర్ ఉపాధ్యాయులకు, నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.'టీచర్ 5.0' వంటి శిక్షణలు ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యభివృద్ధి కి దొహద పడతాయని పాల్గొన్న ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు.




