Bichkunda: ఘనంగా శ్రీ రచ్చ జగన్నాథ్ ప్రతిభా పురస్కారాల ప్రదానం!

Bichkunda: కామారెడ్డి జిల్లా బిచ్కుందలో పదో తరగతి ప్రతిభావంతులకు శ్రీ రచ్చ జగన్నాథ్ స్మారక ప్రతిభా పురస్కారాలు, నగదు బహుమతుల ప్రదానం.

VEERANNA, JUKKAL
Published on: 15 Aug 2026 3:53 PM IST
Bichkunda
X

Bichkunda: ఘనంగా శ్రీ రచ్చ జగన్నాథ్ ప్రతిభా పురస్కారాల ప్రదానం!

Bichkunda: బిచ్కుంద (కామారెడ్డి ) బిచ్కుంద పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శ్రీ రచ్చ జగన్నాథ్ స్మృతి సమితి ఆధ్వర్యంలో మార్చి 2026లో పదవ తరగతిలో మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రచ్చ జగన్నాథ్ స్మారక ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేయబడ్డాయి.

ఈ సందర్భంగా 570 మార్కులు సాధించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి మౌలానా, బాలికల ఉన్నత పాఠశాల బిచ్కుంద విద్యార్థిని స్మిత, శాంతాపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థిని చవాన్ సాత్విక, పెద్ద దడ్గి ఉన్నత పాఠశాల విద్యార్థినులు కళ్యాణి, శృతిక లకు నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రం, మెమెంటో మరియు మెడల్ ప్రదానం చేశారు.

కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు విశ్వేశ్వరరావు, అక్తర్ బేగం, దత్తా గౌడ్, మనోహర్, శ్రీ రచ్చ జగన్నాథ్ స్మృతి సమితి సంయోజకులు రచ్చ శ్రీకాంత్, రచ్చశివకాంత్,ఉపాధ్యాయులు చంద్ర శేఖర్, రాజ్ కుమార్, భూమన్న, దత్తు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ, భవిష్యత్‌లో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించేలా ప్రేరణ కల్పించడమే ఈ పురస్కారాల ప్రధాన లక్ష్యమని రచ్చ శివకాంత్ తెలిపారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story