Bichkunda: అభివృద్ధిని చూసి ఓర్వలేకే విమర్శలు: కార్తీక్ సంతోష్ వర్గం
Bichkunda: బిచ్కుంద మున్సిపాలిటీ 3వ వార్డులో అభివృద్ధిని చూసి ఓర్వలేకే బీఆర్ఎస్ విమర్శలు చేస్తుందని కౌన్సిలర్ కార్తీక్ సంతోష్ వర్గీయుల ఆగ్రహం.
Bichkunda: అభివృద్ధిని చూసి ఓర్వలేకే విమర్శలు: కార్తీక్ సంతోష్ వర్గం
కామారెడ్డి జిల్లా: బిచ్కుంద మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు రాజకీయవేడినిరాజేస్తున్నాయి.పట్టణం లొని మూడో వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడంపై కౌన్సిలర్ ధర్పల్‌కార్తీక్‌సంతోష్‌వర్గీయులు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రజలకు ఉపయోగపడే పనులు జరుగుతుంటే అభినందించాల్సింది పోయి రాజకీయ విమర్శలు చేయడం ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు.
బిచ్కుంద మున్సిపాలిటీ మూడోవార్డుఅభివృద్ధిపనులతోరూపురేఖలుమార్చుకునేందుకు అడుగులు వేస్తున్న క్రమంలోనే వార్డు లో మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, రహదారులు, డ్రైనేజీ వంటి సమస్యల పరిష్కారానికి కౌన్సిలర్ ధర్పల్ కార్తీక్ సంతోష్ చొరవ తీసుకుంటున్నారని స్థానికులు చెబుతున్నారు. కాగ అభివృద్ధి పనులే ఇప్పుడు రాజకీయ విమర్శలకు వేదికగా మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అభివృద్ధి జరుగుతుంటే కొందరికి ఎందుకింత అసహనం ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తుంటే రాజకీయ విమర్శలు ఎందుకుఅంటూ కౌన్సిలర్ వర్గీయులు బీఆర్ఎస్ నేతలను ప్రశ్నిస్తున్నారు. మూడోవార్డులో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేకే విమర్శలకు దిగుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. విమర్శలకు మాటలతో కాదు చేసిన అభివృద్ధి పనులతోనే సమాధానం చెబుతామని స్పష్టం చేస్తున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు ముందుకు వెళ్తున్నామని రాజకీయాలకు అతీతంగా వార్డుఅభివృద్ధికి సహకరించాలని కోరుతున్నారు.
అభివృద్ధి పనులను అడ్డుకోవడం కాదుప్రజల కోసం జరుగుతున్న పనులకు చేయూతనివ్వాలి అంటూ స్థానికులు హితవు పలుకుతున్నారు. మొత్తానికి బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డులో అభివృద్ధి పనులు ఓవైపు సాగుతుంటే మరోవైపు రాజకీయ విమర్శలు వేడెక్కుతున్నాయి. ప్రజలకు కావాల్సింది రాజకీయ విమర్శలు కాదు అభివృద్ధి మరి ఈ అభివృద్ధి రాజకీయ దుమారానికి ఎక్కడి వరకు దారితీస్తుందో చూడలి.




