Bichkunda: బిచ్కుందలో గణేష్ ఉత్సవాలపై శాంతి సమావేశం!
Bichkunda: బిచ్కుంద మున్సిపల్ కార్యాలయంలో వినాయక నవరాత్రుల నిర్వహణపై శాంతి సమావేశం జరిగింది. మండపాల వద్ద డీజేలకు అనుమతి లేదని చైర్‌పర్సన్ శిమ సెట్కార్, ఎస్సై గుండెల రాజు స్పష్టం చేశారు.
Bichkunda: బిచ్కుందలో గణేష్ ఉత్సవాలపై శాంతి సమావేశం!
బిచ్కుంద: ఈ నెల 14 నుంచి ప్రారంభమయ్యే వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రారంభం నుంచి నిమజ్జనం వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలోనిర్వహించాలని బిచ్కుంద మున్సిపల్ చైర్‌పర్సన్ శిమ సెట్కార్ సూచించారు. బుధవారం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఆమె అధ్యక్షతన గణేష్ ఉత్సవాల నిర్వహణపై శాంతి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్సై గుండెల రాజు మాట్లాడుతూ ప్రతి ఏడాది మాదిరిగానే గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంతంగానిర్వహించుకోవాలని ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు. సంప్రదాయాలకు అనుగుణంగా ఉత్సవాలు జరుపుకోవాలని,నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు.మండపాల వద్ద డీజేలకు అనుమతి లేదని, డీజేల కారణంగా కొందరు ప్రాణాలు కోల్పోయినఘటనలు ఉన్నాయని చైర్‌పర్సన్ సెట్కార్ పేర్కొన్నారు.
డీజేలకుబదులుగా స్థానిక సంప్రదాయం ప్రకారం రాత్రివేళభజనలువంటికార్యక్రమాలు నిర్వహిస్తే భక్తులు పెద్ద సంఖ్యలోపాల్గొనేఅవకాశంఉంటుందనితెలిపారు. ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీస్ శాఖ పూర్తి సహకారం అందిస్తుందనిఎస్సైరాజుహామీఇచ్చారు.మండపాల వద్ద పారిశుధ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని మున్సిపల్ అధికారులను చైర్‌పర్సన్ ఆదేశించారు. వంతుల వారీగా పారిశుధ్య సిబ్బందిని ఏర్పాటు చేసి పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.
ప్రతి వినాయక మండపాన్ని తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలని, మండపాల వద్ద పోలీస్, ఫైర్, విద్యుత్ తదితర అత్యవసర సేవల సంప్రదింపు నంబర్లతో కూడిన పోస్టర్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. నిమజ్జనం రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా మున్సిపల్ సిబ్బంది అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారని పేర్కొన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ హయ్యుం, వైస్ చైర్‌పర్సన్ భాగ్యలక్ష్మి ప్రేమ్‌సెట్, ఆర్‌ఐ అంజయ్య, కౌన్సిలర్లు శ్యామల గంగాధర్, దర్పల్ కార్తీక్ సంతోష్, నాహుషా నాయక్, మారోతి, దర్పల్ గంగాధర్, సాయికుమార్‌తో పాటు గణేష్ మండపాల నిర్వాహకులు, పోలీస్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




