Bichkunda: అధికారులు ప్రజా సమస్యలు తీరుస్తారా? నాయకుల కనుసన్నల్లో పనిచేస్తారా?
Bichkunda: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీలో అధికారుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు.
Bichkunda: అధికారులు ప్రజా సమస్యలు తీరుస్తారా? నాయకుల కనుసన్నల్లో పనిచేస్తారా?
బిచ్కుంద: బిచ్కుంద ( కామారెడ్డి ) నూతనంగా ఏర్పాటైన బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారంలో మున్సిపల్ అధికారుల తీరు రోజురోజుకూ మారుతుండటంపై ప్రజల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, వాటి పరిష్కారానికి కౌన్సిలర్ సూచనల కోసం ఎదురుచూస్తున్న పరిస్థితులు నెలకొన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇటీవల కందర్పల్లి ప్రాంతంలో నెలకొన్న సమస్యపై ప్రజలు ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో మోటార్ పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర నీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను సంబంధిత మున్సిపల్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా, కౌన్సిలర్ సూచన అనంతరం మోటార్ మరమ్మతులు చేస్తామని సిబ్బంది చెప్పినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.
ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తినప్పుడు వెంటనే స్పందించి పరిష్కరించాల్సిన అధికారులు, కౌన్సిలర్ సూచన కోసం ఎదురుచూడటం ఏమిటని 6వ వార్డు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారులు ప్రజా సమస్యల పరిష్కారం కోసంవిధులునిర్వహిస్తున్నారా.. లేక కౌన్సిలర్ల సూచనల మేరకే పనిచేస్తున్నారా అంటూవిమర్శలువెల్లువెత్తుతున్నాయి.ఈ వ్యవహారంపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ జుక్కల్ నియోజకవర్గ ఇన్‌చార్జి జాదవ్ ఈశ్వర్ మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.
ప్రజలకు సంబంధించిన సమస్యలను రాజకీయాలు, వ్యక్తిగత సూచనలతో సంబంధం లేకుండా అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆయన కోరారు.ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి 6వ వార్డులో నెలకొన్న నీటి సమస్యను వెంటనే పరిష్కరించడంతో పాటు, మున్సిపాలిటీ పరిధిలోని ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులుకోరుతున్నారుప్రజాస్వామ్య పాలనలో ప్రజల సమస్య పరిష్కారం ముఖ్యమా లేక నాయకుల అనుమతి ముఖ్యమా అనే విమర్శలు విన్పిస్తున్నాయి.
ఏ ఒక్క భారతీయ పౌరుడైనా సమస్య పై అడిగే స్వచ్ఛ ఉంటుంది. అలాంటప్పుడు అధికారులు ప్రజలేదుర్కొంటున్న సమస్య ను తెలుసుకొని పరిస్కార మార్గం చూపాలి ఒక యువకుడు గత 3 రోజులుగా సంబంధిత అధికారికి సమస్య పై విన్నవించిన అధికారులు పట్టించుకోకపోవడంతో ఆ యువకుడు నేరుగా మున్సిపల్ కామిషనర్ కార్యాలయం ముందు కింద కూర్చొని నిరసన వ్యక్త పర్చే పరిస్థితి నెలకొంది.దీనిపై అధికారులు ఎంత వరకు స్పందిస్తారో చూడాలి.




