Bichkunda: బిచ్కుందలో కాంగ్రెస్ నిరసన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్
Bichkunda: బిచ్కుందలో రాహుల్ గాంధీ అరెస్ట్‌కు నిరసనగా కాంగ్రెస్ ఆందోళన. నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్.
Bichkunda: బిచ్కుందలో కాంగ్రెస్ నిరసన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్
బిచ్కుంద: (కామారెడ్డి) బిచ్కుంద పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగ్ నాథ్, పట్టణ అధ్యక్షుడు విజయ్ భాస్కర్ రెడ్డి ల ఆధ్వర్యంలో బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతి యుత నిరసన కార్యక్రమం చేపట్టారు. దేశ రాజధాని ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజీ నిరసనలో పాల్గొన్న ఏ ఐ సి సి అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా ఇతర ప్రతిపక్ష నాయకుల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తూ నీట్ పేపర్ లీక్ వ్యవహారానికి నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తమ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
తమకు జరిగిన అన్యాయాన్ని భరించక న్యాయం కోసం శాంతి యుతంగా నిరసన తెలిపేందుకు వచ్చిన విద్యార్థులను, నిరుద్యోగులను పాశవికంగా కొట్టడమేంటని బిజెపి ప్రభుత్వం పై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, విద్యార్థుల భవిష్యత్తు రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పోరాటం విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.
విద్యార్థుల భవిష్యత్తు తో చెలగాటమాడిన నీట్ పేపర్ లిక్ పై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఎ ఐ సి సి, టి పి సి సి, స్థానిక ఎమ్మెల్యే పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమం లో భాగంగా గురువారం చేపట్టిన శాంతియుత నిరసన కార్యక్రమం లో బిచ్కుంద మున్సిపాలిటీ చైర్ పర్సన్ సీమ సెట్కార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొంగల శంకర్ లతోపాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తమ మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమం లో పి సి సి డెలిగేట్ విఠల్ రెడ్డి, వాజిద్ నగర్, సెట్లుర్, హస్గుల్, పుల్కల్, ఖాత్ గావ్, గుండె నేమ్లి, గుండె కల్లూరు, ఎల్లారం, పత్లాపూర్, మిషన్ కల్లలి గ్రామ సర్పంచ్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




