Bichkunda: పలువురు పోలీసుల బదిలీ.. సిబ్బందిని సత్కరించిన సిఐ, ఎస్సై!

Bichkunda: బిచ్కుంద పోలీస్ స్టేషన్‌లో బదిలీపై వెళ్తున్న సిబ్బందికి ఘనంగా వీడ్కోలు. ఉద్యోగులకు బదిలీలు సహజమైన ప్రక్రియ అన్న సిఐ రవి కుమార్.

VEERANNA, JUKKAL
Published on: 7 May 2026 3:05 PM IST
Bichkunda
X

Bichkunda: పలువురు పోలీసుల బదిలీ.. సిబ్బందిని సత్కరించిన సిఐ, ఎస్సై!

బిచ్కుంద: బిచ్కుంద (కామారెడ్డి) ప్రతి ప్రభుత్వ శాఖలో ఉద్యోగం చేసే ప్రతి ఉద్యోగికి బదిలీలు అనేది సహజమైన ప్రక్రియ అని బిచ్కుంద సి ఐ. రవి కుమార్ అన్నారు. బిచ్కుంద పోలీస్ స్టేషన్ లో పని చేస్తూ విధుల్లో ప్రతిభ కనబర్చిన పలువురు పోలీసు సిబ్బంది బదిలి కావడంతో వారందరికీ ఘనంగ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు బదిలి అయిన వారిలో బిచ్కుంద పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేసిన జీవన్ హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ పొంది బాన్సువాడ కు బదిలి కాగా కానిస్టేబుళ్లు మురళి, నదిమ్ (పిట్లం) షేరు, స్వప్న (పెద్ద కొడప్ గల్) శ్రీకాంత్ (రాజంపేట) యాదగిరి,(దేవునిపల్లి) గంగాధర్ ( నసుర్ల బాద్) హోం గార్డ్ మారుతి (నిజాంసాగర్) ఉమెన్ పి సి లు శోభ, (నసుర్ల బాద్) శ్వేత (లింగం పేట్) పోలీస్ స్టేషన్ లకు బదిలి కావడం జరిగింది.

బదిలీపై వెళ్తున్న పోలీస్ సిబ్బందిని బిచ్కుంద సి ఐ రవి కుమార్, ఎస్సే గుండెల్ల రాజు పోలీస్ సిబ్బంది కలిసి శాలువాలు కప్పి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. బిచ్కుంద పోలీస్ స్టేషన్ లో చూపించిన క్రమ శిక్షణ, విధి నిర్వహణ , ప్రజలతో మమేకమైన తీరు అభినందనీయమని ఎక్కడ పని చేసిన అదే నిబద్ధత తో ప్రజలకు సేవ చేసి పోలీస్ శాఖ కు మంచి పేరు తీసుకురావాలని విధి నిర్వహణలో నిబద్ధత తో పాటు తమను నమ్ముకున్న కుటుంబ సభ్యుల ఆరోగ్యం, సంక్షేమం పై కూడా శ్రద్ధ పెట్టాలని సూచించారు. కార్యక్రమం లో సి ఐ, ఎస్సే లతోపాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story