Bichkunda: సెంట్రల్ లైటింగ్ పనులపై నిర్లక్ష్యం ఎమ్మెల్యేపై బీజేపీ ఫైర్!
Bichkunda: బిచ్కుందలో సెంట్రల్ లైటింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలి. లేకుంటే భారీ ధర్నా చేస్తామని జుక్కల్ ఎమ్మెల్యేకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిన్న రాజులు హెచ్చరిక.
Bichkunda: సెంట్రల్ లైటింగ్ పనులపై నిర్లక్ష్యం ఎమ్మెల్యేపై బీజేపీ ఫైర్!
బిచ్కుంద: బిచ్కుంద పట్టణంలో నత్తనడకన సాగుతున్న సెంట్రల్ లైటింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని లేనిపక్షంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన, ధర్నా, రాస్తారోకో కార్యక్రమం చేపడతామని బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు హెచ్చరించారు.
సోమవారం బిచ్కుంద పట్టణం లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు.
ప్రజలిచ్చిన హామీలు పూర్తి చేయని పక్షంలో ప్రజలే తగిన గుణపాఠం చెపుతారని పేర్కొన్నారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు ఎన్నికై రెండున్నరేళ్ళు గడిచిన అభివృద్ధి పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా పనులునిలిచిపోయాయని ఎద్దేవా చేశారు.
ప్రజా సమస్యలను ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం సరికాదన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి పాలన సాగించడం సరికాదని, అభివృద్ధి పై దృష్టి పెట్టకపోతే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.
కార్యక్రమం లో జుక్కల్ మాజి ఎమ్మెల్యే, మాజి బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షురాలు టి. అరుణ తార, బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు సెట్పల్లి విష్ణు, ఫిరాజీ, రాథోడ్ సునీత, పత్తి రమేష్, గంగరాజ్ తదితరులు పాల్గొన్నారు.




