Dichpally: క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు.. ఎమ్మెల్యే భూపతి రెడ్డి పిలుపు
Dichpally: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి 7వ బెటాలియన్‌లో 6వ తెలంగాణ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బేస్ బాల్ ఛాంపియన్‌షిప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
Dichpally: క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు.. ఎమ్మెల్యే భూపతి రెడ్డి పిలుపు
Dichpally: నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి 7 వ బెటాలియన్ లో రాష్ట్రస్థాయి బేస్ బాల్ పోటీలను జ్యోతి ప్రప్రారంభించినజ్వలనతో ప్రారంభించారు ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులు అవకాశాలను అందిపుచ్చుకొని రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించాలని పేర్కొన్నారు.
బేస్ బాల్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలబాలికల 6వ తెలంగాణ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బేస్ బాల్ చాంపియన్షిప్ 2026 పోటీలు డిచ్ పల్లి 7 వ బెటాలియన్ లో నిర్వహించగా ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి క్రీడలకు పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. క్రీడాకారులు అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నతంగా రాణించి జిల్లాకు గొప్ప పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
క్రీడల ద్వారా మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. కేవలం ఇవి క్రీడల వరకే కాకుండా ఉద్యోగ అవకాశాల్లో కూడా కీలకపాత్ర పోషిస్తాయని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో 7 వ బెటాలియన్ కమాండెంట్ సత్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్,
ప్రధాన కార్యదర్శి పొలసాని శ్రీనివాస్, ఉమ్మాజి నరేష్, మునిపల్లి సాయి రెడ్డి, 1వ డివిజన్ కార్పొరేటర్ అగ్గు భోజన్న, బాగారెడ్డి, రాంచందర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, ధర్మగౌడ్, సుదర్శన్, సాయరెడ్డి, బేస్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్వేత, కోశాధికారి డా. కృష్ణ, జిల్లా కార్యదర్శి సొప్పరి వినోద్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.




