Banswada: బాన్సువాడ తాడ్కోల్ చౌరస్తాలో రోడ్డు విస్తరణ పనులు షురూ!

Banswada: తాడ్కోల్ చౌరస్తాలో చిన్నారి మృతి చెందిన నేపథ్యంలో స్పందించిన యంత్రాంగం. ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు ఆధ్వర్యంలో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం.

SALEEM, BANSWADA
Published on: 29 Aug 2026 1:09 PM IST
Banswada
X

Banswada: బాన్సువాడ తాడ్కోల్ చౌరస్తాలో రోడ్డు విస్తరణ పనులు షురూ!

Banswada: చౌరస్తా మలుపులో రోడ్డుకు ఆనుకుని ఉన్న ఇందిరా గాంధీ విగ్రహం, రోడ్డు డివైడర్, రోడ్డు పక్కన అక్రమ షెడ్లు, తోపుడు బండ్లు, ఫ్లెక్సీ బోర్డులు వాహనదారులకు ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకుండా అడ్డుపడుతున్నాయని అధికారులు గుర్తించారు. ముఖ్యంగా స్కూల్ వేళల్లో విద్యార్థులు రోడ్డు దాటేటప్పుడు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని తేలింది.

వెంటనే జేసీబీలతో ఆక్రమణల తొలగింపు చేపట్టారు. ఇందిరా గాంధీ విగ్రహాన్ని వెనుకవైపుకు జరిపి ప్రతిష్టిస్తున్నారు. డివైడర్ ను తొలగించి రోడ్డును వెడల్పు చేస్తున్నారు. చౌరస్తా వద్ద స్పీడ్ బ్రేకర్లు, సూచిక బోర్డులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత ప్రాతిపదికన రహదారి భద్రతా చర్యలు చేపడతామని, పట్టణంలోని ఆక్రమణలన్నీ తొలగించి రోడ్లను వెడల్పు చేస్తామని ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు తెలిపారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA

Next Story