Banswada: రైస్ మిల్లులపై విజిలెన్స్ దాడులు ఆపాలి: బాన్సువాడలో మిల్లర్ల బంద్!
Banswada: రైస్ మిల్లులపై విజిలెన్స్ దాడులు ఆపాలని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రైస్ మిల్లర్ల బంద్. సీఎం చర్చలకు పిలవాలని మిల్లర్ల డిమాండ్.
Banswada: రైస్ మిల్లులపై విజిలెన్స్ దాడులు ఆపాలి: బాన్సువాడలో మిల్లర్ల బంద్!
బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రైస్ మిల్లర్లు నిరసనకు దిగారు. రైస్ మిల్లులపై జరుగుతున్న విజిలెన్స్ దాడులను వెంటనే నిలిపివేయాలని, ట్రాన్స్ పోర్ట్ ఛార్జిలను వెంటనే పెంచాలని, మిల్లర్లు డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా మాజీ గౌరవ అధ్యక్షులు నాగులగామ వెంకన్నసెట్ మాట్లాడుతూ...పెండింగ్‌లో ఉన్న మిల్లింగ్ చార్జీలను వెంటనే చెల్లించాలని,ట్రాన్స్‌పోర్ట్ చార్జీలను పెంచాలని, ప్రభుత్వాన్ని కోరారు.
తమ సమస్యలపై ముఖ్యమంత్రి వెంటనే చర్చకు పిలవాలని మిల్లర్లు విజ్ఞప్తి చేశారు.సీఎం చర్చకు పిలిచి సమస్యలను పరిష్కరించే వరకు రైస్ మిల్లుల బంద్ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దీంతో బాన్సువాడలో రైస్ మిల్లర్లు బంద్ పాటిస్తూ నిరసన చేపట్టారు.
బాన్సువాడ పట్టణంలోని తిరుమల రైస్ మిల్లులో మీడియా సమావేశం నిర్వహించిన మిల్లర్లు.. తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. విజిలెన్స్ దాడులు ఆపడంతో పాటు, పెండింగ్ బిల్లులు, మిల్లింగ్ మరియు ట్రాన్స్‌పోర్ట్ చార్జీలపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ప్రధానంగా ఆరు డిమాండ్ లు ఉన్నాయని,వాటిని పరిష్కరించాలని,లేని యెడల ఆందోళనలు ఉదృతం చేస్తామని,తమ రైస్ మిల్లుల్లో,మిల్లింగ్ ఆపేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, బీర్కూర్ సంతోష్ సెట్,ఈవాల కృష్ణారెడ్డి,ఎల్లా రెడ్డి,రాజేశ్వర్ గుప్తా,లతో పాటు అన్ని రైస్ మిల్లుల యజమానులు పాల్గొన్నారు.




