Banswada: బాన్సువాడలో ఘనంగా స్వాతంత్ర వేడుకలు – జెండా ఎగరేసిన పోచారం
Banswada: బాన్సువాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 80వ స్వాతంత్ర వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి.
Banswada: బాన్సువాడలో ఘనంగా స్వాతంత్ర వేడుకలు – జెండా ఎగరేసిన పోచారం
బాన్సువాడ: బాన్సువాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు, బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి , బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి , పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ పట్టణంలోని తన నివాసం వద్ద, ఆటోనగర్ వెల్ఫేర్ అసోసియేషన్లో, తెలంగాణ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.
Next Story




