Banswada: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కమిషనర్ గంగాధర్!
Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పరిధిలోని బోర్లం మైనారిటీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ హాస్టల్‌ను మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Banswada: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కమిషనర్ గంగాధర్!
బాన్సువాడ: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ బోర్లం మైనారిటీస్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డ్రాప్ బాక్స్‌లో అందిన ఫిర్యాదుల వివరాలను కమిషనర్ పరిశీలించారు.
అనంతరం విద్యార్థులతో మాట్లాడి పాఠశాల ఉపాధ్యాయులు అందిస్తున్న బోధనా విధానం, విద్యా ప్రమాణాలు మరియు విద్యార్థులకు అందుతున్న విద్యా నాణ్యత గురించి తెలుసుకున్నారు. అలాగే వంటకు సంబంధించిన సామగ్రి స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి, అందుబాటులో ఉన్న వంట సరుకులను తనిఖీ చేశారు. సరుకులు తాజాగా ఉండటంతో పాటు నాణ్యమైనవిగా ఉన్నాయో లేదో పరిశీలించారు. అనంతరం కమిషనర్ విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారి సమస్యలు, అవసరాలు మరియు అభిప్రాయాలను తెలుసుకున్నారు.
Next Story




