Banswada: పల్లె దవాఖానాను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే పోచారం

Banswada: పాత బాన్సువాడ పల్లె దవాఖానాను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి ఆదేశం.

SALEEM, BANSWADA
Published on: 31 July 2026 5:48 PM IST
Banswada
X

Banswada: పల్లె దవాఖానాను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే పోచారం

బాన్సువాడ: పల్లె దవాఖానాను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే పోచారం. బాన్సువాడ పట్టణ కేంద్రంలో ఆకస్మికంగా పాత బాన్సువాడ పల్లె దవాఖానను స్థానిక శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డితనిఖీ చేసారు.

దవాఖానలో రోగులకు అందుతున్న వైద్య సేవలను ప్రత్యక్షంగా పరిశీలించి, వైద్య సిబ్బందితో మాట్లాడి, రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమయానికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.

అవసరమైన మందులు, సదుపాయాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, వర్షాకాలంలో వ్యాపించే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ నివారణ చర్యలను సమీక్షిస్తూ, రోగులకు సమయానికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి సిబ్బందికి సూచనలు చేసిన పోచారం .

ఈ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA

Next Story