Banswada: జీవీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు రహదారి భద్రత అవగాహన

Banswada: బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జీవీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

SALEEM, BANSWADA
Published on: 8 Sept 2026 7:05 PM IST
Banswada
X

Banswada: జీవీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు రహదారి భద్రత అవగాహన

బాన్సువాడ: బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జీవీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ సలాం అధ్యక్షతన జరిగింది.ఈ కార్యక్రమంలో సహాయక మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (AMVI) రఫీ, జీవీ ఆర్ ట్రస్టు అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా AMVI రఫీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రహదారి భద్రతా నియమాలను పాటించాలని సూచించారు. వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, హెల్మెట్ ధరించడం, సీటు బెల్ట్‌ ఉపయోగించడం, మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థులు చిన్న వయస్సులోనే రహదారి భద్రతపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.

జీవీఆర్ ట్రస్టు అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రహదారి భద్రతపై అవగాహన కల్పించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. రహదారి ప్రమాదాల నివారణకు ప్రజలందరూ బాధ్యతగా వ్యవహరించి, రహదారి నియమాలను పాటించాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, ట్రస్టు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA

Next Story