Banswada: అటవీ భూమి కబ్జా చేస్తే జైలుకే.. బాన్సువాడ కోర్టు సంచలన తీర్పు!

Banswada: బాన్సువాడ రేంజ్ పరిధిలో అటవీ భూమిని ఆక్రమించి చెట్లు నరికిన వ్యక్తికి న్యాయస్థానం 15 రోజుల రిమాండ్ విధించిందని రేంజ్ అధికారి హబీబ్ తెలిపారు.

SALEEM, BANSWADA
Published on: 10 Sept 2026 8:30 PM IST
Banswada
X

Banswada: అటవీ భూమి కబ్జా చేస్తే జైలుకే.. బాన్సువాడ కోర్టు సంచలన తీర్పు!

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ రేంజ్ పరిధిలోని నస్రుల్లాబాద్ మండలం బొప్పాస్ పల్లి గ్రామ శివారు లోని అటవీ భూమిని ఆక్రమించి, అటవీ భూమిలో అక్రమంగా చెట్లు నరికి, మొక్కజొన్న పంట సాగు చేస్తున్న దేవసోత్ మోహన్ అనే వ్యక్తిపై అటవీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి అట్టి వ్యక్తిని అరెస్టు చేసి బాన్సువాడ కోర్టులో హాజరు పరచగా, జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ నిందితుడికి 15 ( పదిహేను) రోజుల రిమాండ్ విధించి నట్లు బాన్సువాడ అటవీ రేంజ్ అధికారి M A హబీబ్ తెలిపినారు.

ఎవరైనా అటవీ భూమిని కబ్జా చేసినట్లయితే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందులో అటవీ సెక్షన్ అధికారి V. నరేష్, మరియు అటవీ బీట్ అధికారులు ch.రమాకాంత్ మరియు సయ్యద్ ఇమ్రాన్ ఉన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA

Next Story