Banswada: జయశంకర్ ఆశయాలతోనే తెలంగాణ సాకారం: బాన్సువాడలో BRS నివాళి!

Banswada: బాన్సువాడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఘనంగా జరిగింది. నాయకుడు షేక్ జుబేర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

SALEEM, BANSWADA
Published on: 6 Aug 2026 5:57 PM IST
Banswada
X

Banswada: జయశంకర్ ఆశయాలతోనే తెలంగాణ సాకారం: బాన్సువాడలో BRS నివాళి!

ప్రొ. జయశంకర్ ఆశయాలతోనే తెలంగాణ సాకారం.బీ ఆర్ ఎస్.

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా బాన్సువాడలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకుడు,మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా షేక్ జుబేర్ మాట్లాడుతూ,తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకు ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతాలు,మార్గదర్శకత్వం పునాదిగా నిలిచాయని అన్నారు.ఆ మహనీయుడు చూపిన దారిలో బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ప్రజలను ఏకం చేసి సుదీర్ఘ ఉద్యమాన్ని విజయవంతంగా నడిపించడంతో తెలంగాణ రాష్ట్రం సాకారమైందని పేర్కొన్నారు.

తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం,రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కేసీఆర్ ఎన్నో సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశారని అన్నారు.జయశంకర్ ఆశయాలను భావితరాలకు చేరవేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని,బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ తెలంగాణ ఆత్మగౌరవ పరిరక్షణకు కట్టుబడి ఉంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు,ప్రజాప్రతినిధులు ,కార్యకర్తలు, ఘన నివాళులు అర్పించారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA

Next Story