Banswada: బాన్సువాడలో విషాదం.. ఆగి ఉన్న ట్రాక్టర్‌ను బైక్ ఢీకొని యువకుడు మృతి!

Banswada: బాన్సువాడ-కొత్తబాది రహదారిపై ఘోర ప్రమాదం. నిలిపి ఉంచిన ట్రాక్టర్‌ను బైక్ ఢీకొని కొత్తబాది గిర్ని తండాకు చెందిన పాల్యా రాజు (28) అక్కడికక్కడే మృతి.

SALEEM, BANSWADA
Published on: 27 Aug 2026 1:36 PM IST
Banswada
X

Banswada: బాన్సువాడలో విషాదం.. ఆగి ఉన్న ట్రాక్టర్‌ను బైక్ ఢీకొని యువకుడు మృతి!

Banswada: బాన్సువాడ–కొత్తబాది ప్రధాన రహదారిపై మొగలాన్‌పల్లి గ్రామ శివారులో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తబాది గిర్ని తండాకు చెందిన పాల్యా రాజు (28) బైక్‌పై బాన్సువాడ నుంచి కొత్తబాది వైపు వెళ్తున్న క్రమంలో ఎన్‌హెచ్‌-765డీపై రోడ్డుపక్కన నిలిపి ఉన్న ట్రాక్టర్‌ను ఢీ కొనడంతో రాజుకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

మృతుడు రాజు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడని, ఆయనకు భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ పెద్ద దిక్కు చనిపోవడం తో ఆ కుటుంబం వీధిన పడింది.

ఘటనపై సమాచారం అందుకున్న బాన్సువాడ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. అనంతరం మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తగిలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA

Next Story