Bichkunda: దివ్యాంగుల సంక్షేమ పథకాలపై బిచ్కుందలో అవగాహన సదస్సు!

Bichkunda: సమాఖ్య కార్యాలయంలో దివ్యాంగులకు సంక్షేమ పథకాలు, సదరం సర్టిఫికెట్లు, UDID కార్డులపై సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ జూమ్ ద్వారా అవగాహన కల్పించారు.

VEERANNA, JUKKAL
Published on: 18 Aug 2026 4:14 PM IST
Bichkunda
X

Bichkunda: దివ్యాంగుల సంక్షేమ పథకాలపై బిచ్కుందలో అవగాహన సదస్సు!

బిచ్కుంద: బిచ్కుంద మండల సమాఖ్య కార్యాలయంలో దివ్యాంగుల సంఘాల ప్రతినిధులకు దివ్యాంగుల సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సెర్ప్ CEO దివ్య దేవరాజన్ జూమ్ మీటింగ్ ద్వారా దివ్యాంగులకు అందుతున్న పెన్షన్లు, సదరం సర్టిఫికెట్లు, UDID కార్డుల ప్రాధాన్యత, అలాగే కొత్తగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే విధానంపై పూర్తి అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా దివ్యాంగులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగంచేసుకోవాలని,అవసరమైనధ్రువపత్రాలను సమర్పించి పెన్షన్‌తో పాటుఇతరప్రయోజనాలను పొందాలనిసూచించారు.కార్యక్రమంలో బిచ్కుంద మండలంలోని దివ్యాంగుల సంఘాల ప్రతినిధులతో పాటు ఏపీఎం,సీసీలు పాల్గొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story