Bichkunda: జూనియర్ కాలేజీలో డ్రగ్స్, సైబర్ క్రైమ్‌పై అవగాహన సదస్సు!
Bichkunda: కామారెడ్డి జిల్లా బిచ్కుంద ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డ్రగ్స్, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు ఎస్సై గుండెల రాజు అవగాహన కల్పించారు.
Bichkunda: జూనియర్ కాలేజీలో డ్రగ్స్, సైబర్ క్రైమ్‌పై అవగాహన సదస్సు!
బిచ్కుంద: బిచ్కుంద ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు డ్రగ్స్, ట్రాఫిక్ నిబంధనలు, సైబర్ క్రైమ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపక సిబ్బంది సమక్షంలో సుమారు 200 మంది విద్యార్థినీ విద్యార్థులకు బిచ్కుంద ఎస్‌ఐ రాజు పలు అంశాలపై అవగాహన కల్పించారు.
డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలని, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులకువివరించారు.ఈసందర్భంగా విద్యార్థులతో డ్రగ్స్ వ్యతిరేకప్రతిజ్ఞచేయించారు.అనంతరం సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై అవగాహన కల్పిస్తూ OTP, PIN, బ్యాంకింగ్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని, అనుమానాస్పద లింకులను క్లిక్చేయవద్దనిసూచించారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్ ధరించాలని, మైనర్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని సూచించారు.
అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112 సేవలనువినియోగించుకునే విధానాన్ని,దానిప్రాముఖ్యతను ఎస్‌ఐరాజువిద్యార్థులకు వివరించారు.కార్యక్రమంలో ఎస్‌ఐ గుండెల రాజు, కళాశాల ప్రిన్సిపల్ మోహన్ రెడ్డి,అధ్యాపక సిబ్బందితో పాటు బిచ్కుంద పోలీస్ సిబ్బంది బాలరాజు, మహేందర్, వెంకన్న పాల్గొన్నారు. “డ్రగ్స్‌కు నో చెప్పండి.. ట్రాఫిక్ రూల్స్ పాటించండి.. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి” అని పోలీసులు విద్యార్థులకు సూచించారు.




