Armoor: ఆర్మూర్ పాలిటిక్స్‌లో వింత: ఒకే స్థలం.. ఇద్దరు నేతలు!

Armoor: ఇది కదా అసలైన రాజకీయం! ఆర్మూర్‌లో ఒకే 300 గజాల స్థలానికి ఇద్దరు నేతలు పత్రాలు అందజేశారు. ఒకరు ఆర్డీవో ఆఫీస్‌లో ఇస్తే, మరొకరు పార్టీ ఆఫీస్‌లో పంపిణీ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 9 April 2026 7:18 PM IST
Armoor
X

Armoor: ఆర్మూర్ పాలిటిక్స్‌లో వింత: ఒకే స్థలం.. ఇద్దరు నేతలు!

నిజామాబాద్ జిల్లా: ఆర్మూర్ న్యూస్: పట్టణంలో ఇటీవలే ఆర్డీవో ఆఫీస్ లో గల రైతు వేదికలో కళ్యాణ్ లక్ష్మి, రంజాన్ సందర్భంగా మైనార్టీలకు గిఫ్ట్ ప్యాక్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హాజరయ్యారు, ఎమ్మెల్యే చేతుల మీదుగా కళ్యాణ్ లక్ష్మి చెక్కులు,మైనార్టీ కెట్లను ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో చిట్టాపూర్ గ్రామానికి చెందిన వీర జవాన్ ఎర్రం నరసయ్య తల్లికి అధికారులు, ఎమ్మెల్యే చేతుల మీదుగా 300 గజాల స్థలం పేపర్స్ ను అందజేయడం జరిగింది.

విషయం ఏమనగా మళ్లీ వీర జవాన్ ఎర్రం నరసయ్య తల్లికి ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజవర్గ ఇన్చార్జ్ పొద్దుటూరు వినయ్ రెడ్డి తన పార్టీ ఆఫీసులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు కార్యకర్తలు ముందు మళ్లీ తన చేతుల మీదుగా 300 గజల స్థలా పత్రాలు అందజేయడం జరిగింది.

ఈ విషయాన్ని ఇరు పార్టీల కార్యకర్తలు ,నాయకులు, వాట్సాప్ స్టేటస్ లో ఫోటోలు పెట్టుకోవడంతో , ఒకేసారిగా అది చూసి నియోజకవర్గ ప్రజలు అవాకయ్యారు, ఒక నెల కిందనే ఎమ్మెల్యే చేతుల అందజేశారు, మళ్లీ కొత్తగా కాంగ్రెస్ పార్టీ నియోజవర్గ ఇన్చార్జ్ అందచేతుల మీదుగా ఆంజనేయం విశేషం అన్నారు. మొత్తానికైతే నియోజవర్గంలో ప్రజలకు శంకర్ దాదా ఎంబిబిఎస్ రియల్ అండ్ రీల్ గా మారింది, ఈ యొక్క వీర జవాన్ తల్లికి అందజేసిన 300 గజాల స్థలం.... ఒకరు ఇచ్చిన తర్వాత ఇంకొకరికి తీయడం ఏంటి అని ప్రజలకు చర్చ నీ అంశంగా మారింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story