Armoor: ఆర్మూర్‌లో మెడికల్ షాపులు బంద్.. ఆన్‌లైన్ విక్రయాలపై ఫైర్

Armoor: ఆన్‌లైన్ మందుల విక్రయాలు, కార్పొరేట్ సంస్థల భారీ డిస్కౌంట్లకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా కెమిస్ట్స్ పిలుపు మేరకు ఆర్మూర్ లో మెడికల్ షాపులు బంద్ పాటించాయి.

VAMSHI, ARMOOR
Published on: 20 May 2026 7:02 PM IST
Armoor
X

Armoor: ఆర్మూర్‌లో మెడికల్ షాపులు బంద్.. ఆన్‌లైన్ విక్రయాలపై ఫైర్

Armoor: ఆల్ ఇండియా కెమిస్ట్స్ స్ట్రైక్ పిలుపు మేరకు ఆర్మూర్ పట్టణ కెమిస్ట్స్ & డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ లో సంబంధించిన సుమారు 120 మెడికల్ షాపులు & ఏజెన్సీస్ ల ను విజయవంతంగా బంద్ నిర్వహించారు. మెడికల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి: గంజి శేఖర్. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ అల్ ఇండియా కెమిస్ట్స్ స్పైక్ మేరకు స్వచ్ఛందంగా ఈరోజు బంద్ ను తెలుపుతూ , ఆన్లైన్లో మెడిసిన్లను ఆపి వేయాలి, యువత ఆన్లైన్ లో డ్రగ్స్ తీసుకొని, యువత దానికి పరిమితమవుతున్నారు,

కార్పొరేట్ మెడికల్ షాపులు విపరీతమైన డిస్కౌంట్ లిస్టు, మామూలు ఉన్న చిన్న చిరు వ్యాపారులకు జీవనోపాధి లేకుండా చేస్తున్నారు, ఈ కార్పొరేట్ షాపులకు, ఆన్లైన్లో ఇచ్చే మందుల వారికి లైసెన్స్ రద్దు చేయాలని కోరుతూ, ఆన్లైన్లో అమ్మే డూప్లికేట్ మందులు 25% ఇచ్చి ఇక్కడ లోకల్ లో ఏర్పాటు చేసిన మేడకల్ షాపుల వారు 10% డిస్కౌంట్ ఈయగా మా వ్యాపారం మొత్తం జీవనోపాధి లేకుండా చూస్తున్నారు,

మొత్తం దేశవ్యాప్తంగా 13 లక్షల మొత్తం ఈ జీవనోపాధి మీద ఉంది, మేము గవర్నమెంట్ ని ఉద్యోగాలు లాంటివి ఏం అడుగుతాలేము, కావున ఈ ఆన్లైన్లో మందులు అమ్మే, కార్పొరేట్ మెడికల్ షాప్ల వారిపై ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి అంటూ డిమాండ్స్ పై వెంటనే ప్రభుత్వం స్పందించాలని కోరారు.

మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు : మహేష్

ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు మాట్లాడుతూ ఈరోజు పట్టణంలో సుమారు 120 మెడికల్ షాపు ల ను విజయవంతంగా బంద్ చేయడం జరుగుతుంది, ఆన్లైన్లో మెడిసిన్స్ అమ్మడంతో , అలాగే కార్పొరేట్ షాపులు భారీ డిస్కౌంట్ ఇవ్వడంతో మా ఒక్క లోకల్ మెడికల్ కు జీవనోపాధి లేకుండా పోతుంది, ఇకనైనా ప్రభుత్వం స్పందించి వారి లైసెన్స్ రద్దు చేయాలని అంటూ, దేశవ్యాప్తంగా మొత్తం 1300000 లక్షల మెడికల్ షాపులు ఉన్నాయి, ఇకనైనా ప్రజలు మంచిగా ఆలోచించి లోకల్ లో ఉన్న షాపులను సంప్రదించి మెడిసిన్ కొనాలని మనవి చేస్తూ , అలా ఉండడంతో మెడికల్ షాపులు జీవనం ఉపాధి కోల్పోవడం జరుగుతుంది,వెంటనే ప్రభుత్వం వీరిపై చర్య తీసుకుని, మా మెడికల్ షాప్ కుటుంబాలకు న్యాయం చేయాలంటూ హెచ్ఎంటీవీ ఛానల్ ద్వారా కోరడం జరిగింది.

VAMSHI, ARMOOR

VAMSHI, ARMOOR

Next Story