Armoor: ఆర్మూర్ గ్రంథాలయంలో పుస్తకాల జాతర.. చైర్‌పర్సన్ గోనె లహరి సంచలన వ్యాఖ్యలు!

Armoor: ఆర్మూర్ గ్రంథాలయంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా పుస్తక ప్రదర్శన.

VAMSHI, ARMOOR
Published on: 15 May 2026 3:04 PM IST
Armoor
X

Armoor: ఆర్మూర్ గ్రంథాలయంలో పుస్తకాల జాతర.. చైర్‌పర్సన్ గోనె లహరి సంచలన వ్యాఖ్యలు!

అర్మూర్: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని గ్రంథాలయంలో శుక్రవారం పుస్తక ప్రదర్శన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్ పర్సన్ గోనె లహరి హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ గోనె లహరిని నిర్వాహకులు శాలువాతో సన్మానించారు. అనంతరం చైర్పర్సన్ ఉత్తమ పాఠకులకు సన్మానం చేశారు. చైర్ పర్సన్ గోనె లహరి మాట్లాడుతూ గ్రంథాలయంలో విద్యా వారోత్సవాలు అనేవి పాఠకులకు, విద్యార్థులకు, ప్రజలకు పుస్తక పఠనం పట్ల ఆసక్తిని పెంచడానికి మరియు గ్రంథాలయాల ప్రాముఖ్యతను తెలియజేయడానికి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు మరియు విద్యా సంస్థలను బలోపేతం చేసే లక్ష్యంతో విద్యాశాఖ తరఫున ఇలాంటి ప్రత్యేక వారోత్సవాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ఈ గ్రంథాలయల నుండి గతంలో ఎంతోమంది పాఠకులు ఉద్యోగాలు పొందిన వారున్నారు.. వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నామన్నారు.. ప్రస్తుతము ఉన్న పాఠకులు కూడా మంచి ఉద్యోగాలు పొందాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. గ్రంథాలయంలో వివిధ రకాల పుస్తకాలను పఠనం చేయడం వల్ల మంచి జ్ఞానాన్ని పొందుతారని, జీవితంలో ఒక గొప్ప స్థాయికి ఎదుగుతామని తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ ఇంచార్ స్వామి, గ్రంధాలయ రీడర్స్, తదితరులు పాల్గొన్నారు.

VAMSHI, ARMOOR

VAMSHI, ARMOOR

Next Story