Armoor: ఉపాధి హామీ నిధులతో మహిళా సాధికారతకు పెద్దపీట
Armoor: ఆర్మూర్ మండలం ఫతేపూర్ గ్రామపంచాయతీ ఆవరణలో రూ.10 లక్షల ఉపాధి హామీ నిధులతో నూతన మహిళా భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన సర్పంచ్ ఏనుగు ప్రణుక నాగరాజ్.
Armoor: ఉపాధి హామీ నిధులతో మహిళా సాధికారతకు పెద్దపీట
అర్మూర్: ఆర్మూర్ మండల్ ఫతేపూర్ గ్రామ గ్రామపంచాయతీ ఆవరణలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 10 లక్షలు రూపాయలు మంజూరు కావడంతో గ్రామంలో నూతనంగా మహిళా భవనాన్ని నిర్మాణం.
గ్రామ సర్పంచ్ : ఏనుగు ప్రణుక నాగరాజ్ నూతన మహిళా భవనాన్ని నిర్మిస్తున్న సందర్భంగా ఆ భవనానికి సర్పంచ్ చేతిలో మీదుగా కొబ్బరికాయ కొట్టి, భూమి పూజ తో ప్రారంభించారు, ఈ సందర్భంగా సర్పంచ్ ప్రణుక నాగరాజ్ మాట్లాడుతూ మన ఒక గ్రామ అభివృద్ధి కోసం, ఎల్లవేళలా ముందు ఉంటానంటూ, ప్రభుత్వం రకరకాల పథకాలను ప్రవేశ పెడుతుంది కాబట్టి, అవి గ్రామ ప్రజలు దాని యొక్క సూచనలు పాటిస్తూ, మన ఒక గ్రామ పంచాయతీకి వచ్చి అప్లై చేయగలరు, ప్రజలు ఈ పథకాలని ఉపయోగించుకోగలరు అంటూ, గ్రామ సర్పంచ్ గా అభివృద్ధి చేయడమే నా లక్ష్యం అంటూ, గ్రామ ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా గాని నన్ను సంప్రదించిన తో, వెంటనే నాతో అయినటువంటి సమస్య పరిష్కారాన్ని తీర్చి దిద్దుతానని హెచ్ఎంటీవీ ఛానల్ ద్వారా తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ప్రణుక - నాగరాజ్, సెక్రటరీ దొండి శ్రీధర్, APM భూమేశ్వర్ గౌడ్,IKP CC తిరుపతి, వార్డ్ మెంబర్లు , మహిళలు తదితరులు పాల్గొన్నారు.




