Armoor: రైతులు అధైర్యపడొద్దు.. ప్రతి గింజా కొంటాం.. భరత్ రెడ్డి

Armoor: ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ వినయ్ రెడ్డి ఆదేశాల మేరకు డొంకేశ్వర్ పీఏసీఎస్ అధ్యక్షులు భరత్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులను కలిసి ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ రైతుల వరి కొనుగోలుపై వినతి పత్రం సమర్పించారు.

VAMSHI, ARMOOR
Published on: 3 May 2026 2:41 PM IST
Armoor
X

Armoor: రైతులు అధైర్యపడొద్దు.. ప్రతి గింజా కొంటాం.. భరత్ రెడ్డి

Armoor: ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పొద్దుటూరు వినయ్ రెడ్డి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండల్ ప్రాథమిక వ్యవసాయ సహకార అధ్యక్షులు బర్ల భరత్ రెడ్డి, తెలంగాణ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ విజయ్ కుమార్ కి వినతి పత్రం అందజేశారు.

ప్రాథమిక వ్యవసాయ సహకర అధ్యక్షులు:

ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధ్యక్షుడు భరత్ రెడ్డి మాట్లాడుతూ దొంకేశ్వర్ మండల్ వరి కొనుగోలు విషయంలో, SRSP బ్యాక్ వాటర్ లో సాగుచేసిన వరి కొనుగోలు ను గత ఆరు సంవత్సరాలుగా ఎలా కొనుగోలు చేశారు, అదేవిధంగా కొనుగోలు చేయాలంటూ ఈరోజు హైదరాబాద్ లో అడిషనల్ అగ్రికల్చర్ తెలంగాణ రాష్ట్ర విజయ్ కుమార్ ను కోరారు,

దీనికి సానుకూలంగా స్పందించి వారం రోజుల్లో SRSP రైతులకు OPMS లో ల్యాండ్ ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది, కావున మండల రైతులు ల్యాండ్ లేదని ఆ ధైర్య పడకూడదని, ప్రస్తుతం లారీలు, హమాలి కొడతా ఉండడం వలన, ఒక వారం రోజులు పడుతుంది, కావున ఎవరు కూడా నిరాశ చెందకుండా, పోయిన సంవత్సరంలో ఎలా కొన్నారు, అలాగే రైస్ మిల్ వాళ్లు తీసుకుంటారని డొంకేశ్వరం మండలం హమీ ఇవ్వడం జరుగుతుంది.

VAMSHI, ARMOOR

VAMSHI, ARMOOR

Next Story