Nizamabad: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో భక్తులకు అన్నదాన వితరణ!
Nizamabad: ఆర్మూర్ అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సహకరించిన దాతలను సేవా సమితి ఆధ్వర్యంలో సన్మానించారు.
Nizamabad: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో భక్తులకు అన్నదాన వితరణ!
Nizamabad: పట్టణ కేంద్రంలోని జంబిహాన్ ఆలయ ప్రాంగణంలోని అయ్యప్ప ఆలయంలో బుధవారం నగేష్ శర్మ గురు స్వామి చేతుల మీదుగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆర్మూర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆర్మూర్ అయ్యప్ప సేవాసమితి అన్నదాన కార్యక్రమానికి వితరణగా 2 బఫ్ టేబుల్లను పూల ప్రసాద్, 20 కుర్చీలను మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్ లు దాతలుగా అందజేశారు. సహృదయంతో స్పందించిన దాతలను ఆర్మూర్ సేవ సమితి ఆధ్వర్యంలో సన్మానించారు.
ఈ సందర్భంగా ఆర్మూర్ అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు పుట్టి మురళి మాట్లాడుతూ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన వితరణ కార్యక్రమానికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎల్లవేళలా ప్రతి ఒక్కరీ సహాయ సహకారాలు ఇలాగే ఉండాలని, ఆ హరిహరుని కరుణాకటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో ఆర్మూర్ అయ్యప్ప సేవా సమితి కార్యదర్శి మీసాల రవి, కోశాధికారి గాజ రెడ్డి నర్సరెడ్డి, గౌరవ అధ్యక్షులు జనార్దన్ గౌడ్, ముఖ్య సలహాదారులు దత్తు, మీసాల రాజేశ్వర్, ద్యాగ ఉదయ్, బాల్కొండ రాజు, పూల ప్రసాద్, నందు, గంగాధర్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు భూపేందర్, శాల ప్రసాద్, గంగూలీ తదితరులు పాల్గొన్నారు.




