Nizamabad: హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ వద్దు.. కుటుంబాలను రోడ్డున పడేయొద్దు ఏసీపీ!

Nizamabad: బాల్కొండ మండలంలోని వన్నెల్ ఎక్స్ రోడ్డు వద్ద ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత నాకాబందీ, వాహనాల తనిఖీలు నిర్వహించారు.

VENU, BALKONDA
Published on: 14 Aug 2026 10:25 PM IST
Nizamabad
X

Nizamabad: హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ వద్దు.. కుటుంబాలను రోడ్డున పడేయొద్దు ఏసీపీ!

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలకేంద్రంలోని ప్రధాన కూడలి అయినా వన్నెల్ ఎక్స్ రోడ్ వద్ద నిజామాబాదు పోలీస్ కమిషన్ ఆదేశాల మేరకు ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నాకా బంది కార్యక్రమాన్ని నిర్వాయించారు హెల్మెట్ మరియు సరైన పత్రాలు లేని వాహనాలను తనిఖీ చేశారు.

అనంతరం హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసి ప్రమాదల పాలు అవ్వద్దని మన కుటుంబాన్ని రోడ్డున పదవేయొద్దని మద్యం సేవించి వాహనాలు నడుపవద్దని భద్రత నియమాలు పాటించాలని తెలిపారు.

డ్రక్స్ మరియు గంజాయి లాంటి మత్తు పదార్తలు సేవించిసకూడని మత్తులో ఉండడంతో ఎన్నో అనర్థాలు జరుగుతాయని యువత మత్తుపదార్థాల జోలికి వెళ్లి జీవితం పాడు చేసుకోవద్దని మత్తు సేవించిన ఆరు నెలలలోపు టెస్ట్ కిట్టుల ద్వారా బయట పడుతుందని అప్పుడు జైలు జీవితం తప్పదని హేచ్చరించారు.

VENU, BALKONDA

VENU, BALKONDA

Next Story