Kamareddy: కామారెడ్డిలో చెక్ పోస్టును తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

Kamareddy: కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సలాబత్‌పూర్‌లో చెక్ పోస్టును తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ వి. విక్టర్. ఇతర రాష్ట్రాల నుండి వడ్లు రాకుండా పటిష్టమైన నిఘా.

VEERANNA, JUKKAL
Published on: 23 April 2026 9:51 PM IST
Kamareddy
X

Kamareddy: కామారెడ్డిలో చెక్ పోస్టును తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

సలాబత్ పూర్ (కామారెడ్డి): యాసంగి వరి పంట సన్నం వడ్లు పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణ రాష్ట్రంలోకి రాకుండా ప్రభుత్వం ద్వార పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిగిందని కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వి. విక్టర్ అన్నారు. గురువారం ఆయన మద్నూర్ మండలం సలాబత్ పూర్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను తనిఖీ చేశారు. ప్రస్తుతం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో సిబ్బందికి అవసరమైన మౌలిక వసతులు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారిని ఆదేశించారు. కార్యక్రమం లో మద్నూర్ తహసిల్దార్ ముజీబ్, ఎన్ఫోర్స్మెంట్ నాయబ్ తహసిల్దార్ ఖలీద్, జూనియర్ సహాయకుడు రవి, చెక్ పోస్ట్ సిబ్బంది, ఎ ఇ ఓ సరోజ, గ్రామ పాలన అధికారి గోపాల్, కానిస్టేబుల్ హన్మండ్లు తదితరులు పాల్గొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story