Nizamabad: తెలంగాణ వర్సిటీ వద్ద ఏబీవీపీ ఆందోళన!
Nizamabad: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వర్సిటీ వద్ద ఏబీవీపీ నిరసన.
Nizamabad: తెలంగాణ వర్సిటీ వద్ద ఏబీవీపీ ఆందోళన!
Nizamabad: తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం వద్ద సీఎం దిష్టిబొమ్మ దహనం యత్నం.. అడ్డుకున్న పోలీసులు.తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం వద్ద అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ఏబీవీపీ నాయకులు ప్రయత్నించారు.
ఈ సందర్భంగా అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు వారిని అడ్డుకుని దిష్టిబొమ్మను స్వాధీనం చేసుకున్నారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.ఏబీవీపీ నాయకులు తెలంగాణ విశ్వవిద్యాలయం కార్యదర్శి సమీర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు 11వేయిల కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేసి, ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఏబీవీపీ ఇండోర్ విభాగ్ కన్వీనర్ శశి మాట్లాడుతూ ప్రభుత్వం పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందకుండా దూరం చేస్తున్నారని వెంటనే బకాయిలు విడుదల చేయాలని లేకుంటే ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళన చేస్తాం అని, లేకుంటే ప్రజా ప్రతినిధులను అడ్డుకొని, ఎమ్మెల్యే మంత్రుల ఇళ్ల ను ముట్టడిస్తామని, అసెంబ్లీని ముట్టడించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో నిరసన కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయం ఏబీవీపీ పాల్గొన్నారు విద్యార్థులు.




