Nizamabad: ఆర్మూర్‌లో ఏబీవీపీ నూతన కమిటీ ఎన్నిక!
Nizamabad: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ క్షత్రియ కళాశాలలో ఏబీవీపీ నూతన నగర కమిటీ ఎన్నిక. అధ్యక్షుడిగా వెంకటరమణ చారి, కార్యదర్శిగా సౌరబ్ ఠాకూర్ ఎన్నిక.
Nizamabad: ఆర్మూర్‌లో ఏబీవీపీ నూతన కమిటీ ఎన్నిక!
Nizamabad: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ క్షత్రియ కళాశాలలో ఆర్మూర్ నగర నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నేషనల్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ హర్షవర్ధన్*గా మాట్లాడుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 1949 జులై 9న ప్రారంభించబడి విద్యార్థుల మరియు విద్యారంగ సమస్యల పైన అలాగే సమాజం పట్ల అనేకమైన కార్యక్రమాలు చేస్తుందని ఏబీవీపీ 1999 కార్గిల్ సమయంలో విరాజవానులకు రక్తం అవసరమైన సమయంలో ఏబీవీపీ కార్యకర్తలు రక్తం ఇచ్చారు అని తెలియజేశారు.
కాకతీయ విశ్వవిద్యాలయం ఏబీవీపీ కార్యకర్త సామా జగన్మోహన్ ను జాతీయ జెండా కోసం ఆయన చేసిన ప్రాణ త్యాగాల గురించి విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. అలాగే నూతన కమిటీ తెలియజేస్తూ నగర *అధ్యక్షుడిగా వెంకటరమణ చారి సార్ ని అలాగే నగర కార్యదర్శిగా సౌరబ్ ఠాకూర్ ఎన్నుకోవడం జరుగుతుంది సుమారుగా 30 ఏబీవీపీ కార్యకర్తలతో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇందూరు విభాగ్ ఖేల్ కన్వీనర్ సాయికుమార్ , ఆర్మూర్ నగర వైస్ ప్రెసిడెంట్ స్నేహితు, సిద్ధార్థ్, గంగ ప్రసాద్, ఇతర విద్యార్థి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




