Bodhan: బోధన్‌లో 4 వేల మట్టి గణపతుల పంపిణీ: ఆర్డీవో విజయకుమారి
Bodhan: పర్యావరణ పరిరక్షణలో భాగంగా బోధన్‌లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 4 వేల మట్టి వినాయక విగ్రహాలను ఆర్డీవో విజయకుమారి, ఏసీపీ శ్రీనివాస్ పంపిణీ చేశారు.
Bodhan: బోధన్‌లో 4 వేల మట్టి గణపతుల పంపిణీ: ఆర్డీవో విజయకుమారి
బోధన్: పర్యావరణ పరిరక్షణలో భాగంగా లయన్స్ క్లబ్ అప్ రాకస్పేట్, లైన్స్ క్లబ్ ఆ భవాని ఆధ్వర్యంలో సుమారు 4000 మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఆదివారం బోధన్ ఆర్డిఓ విజయకుమారి, ఏసిపి శ్రీనివాస్ చేతుల మీదుగా మట్టి ప్రతిమలను ప్రజలకు పంపిణీ చేసి ఈ సందర్భంగా వారు మాట్లాడారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పర్యావరణం పై అవగాహన కల్పించడంలో భాగంగా మట్టి వినాయకులను అందించడం అభినందన నియమ మన్నారు.
ఆర్డీఓ మాట్లాడుతూ పుష్కర కాలం పాటు మట్టి వినాయకులను లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అందజేస్తూ కాలుష్య నివారణకు దోహదపడుతున్నారని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులు ప్రజలు మట్టి వినాయకులను ప్రతిష్టించి పూజలు అందించాలని సూచించారు.
మీద రంగులతో కూడిన వినాయకులను నిమజ్జనం చేస్తున్న సమయంలో చెరువులు కుంటల్లో ఉన్న నీరు కలుషితమై చేపలు మూవజీవాలు మృత్యువాత పడడంతో పాటు వాతావరణంలో సైతం కాలుష్యం అధికమతోందని అందుకోసం రంగుల వినాయకులను నివారించి మట్టి వినాయకులను ప్రతిష్టించాలన్నారు.
లైన్స్ క్లబ్ సేవలు ప్రజలకు మరింత చేరువవ్వాలని ఆర్డిఓ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ బృందం బసవేశ్వర రావు, విజయ చక్రవర్తి, పంట నాగేశ్వరరావు, దుర్గారావు, గంగా శంకర్, బోధన్ తాసిల్దార్ విటల్, పట్టణ ఎస్ ఎస్ వెంకటనారాయణ, లైన్స్ క్లబ్ ఆ భవాని బృందం పాల్గొన్నారు.




