Nellore: మెగా డిఎస్సి అవినీతిపై మంత్రి లోకేష్ రాజీనామాకు డిమాండ్!

Nellore: నెల్లూరులో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కోరుతూ వైయస్సార్సీపీ విద్యార్థి సంఘం నేతలు అర్ధనగ్న ప్రదర్శన, భిక్షాటనతో నిరసన తెలిపారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 7 Aug 2026 8:17 AM IST
Nellore
X

Nellore: మెగా డిఎస్సి అవినీతిపై మంత్రి లోకేష్ రాజీనామాకు డిమాండ్!

Nellore: "తొలి రోజు రిలే నిరాహార దీక్ష ముగింపు సందర్బంగా.. అర్థనగ్న ప్రదర్శన నిర్వహించి.. భిక్షాటన చేసిన.. వైఎస్ఆర్సిపి విద్యార్థి సంఘం నేతలు"

నెల్లూరు VRC సెంటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రిలే నిరాహార దీక్షల కార్యక్రమం తొలి రోజు ముగింపు సందర్భంగా వైఎస్ఆర్సిపి విద్యార్థి సంఘం నేతలు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి.. రోడ్డుపై భిక్షాటన చేశారు.

కూటమి ప్రభుత్వంలో విద్యార్థులు, యువత ను ప్రభుత్వం పూర్తిగా రోడ్డు మీదకు తీసుకొచ్చిందన్న ఉదంతాన్ని కళ్ళకు కట్టినట్లు చూపారు.

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, స్కాలర్షిప్ లు అందక విద్యార్థుల చదువులు త్రిశంక స్వర్గంలో.. ఉన్నాయని.. ఫీజులు కట్టలేని విద్యార్థులు.. కళాశాలలకు దూరం అవుతున్నారని వారు ఆవేదన వ్యకం చేశారు... కూటమి ప్రభుత్వం ఇచ్చిన ₹3,000 రూపాయల నిరుద్యోగ భృతి కూడా.. యువతకు అందని ద్రాక్షలా మారిందని.. ఈ పరిస్థితుల్లో యువత.. విద్యార్థులు పూర్తిగా రోడ్డు మీదకొచ్చాశారని తెలిపారు..

విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు ఆశ్రీత్ రెడ్డి మాట్లాడుతూ.....

మెగా DSC లో చోటు చేసుకున్న అవినీతికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు , స్కాలర్షిప్ లు అందక విద్యార్థులు చదువులకు దూరం అయ్యే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు..

విద్యార్ది విభాగం నగర నియోజకవర్గ అధ్యక్షులు తౌఫిక్ మాట్లాడుతూ.....

ఈరోజు రాష్ట్రంలో.. ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో కనీస మౌలిక వసతులు కరువై విద్యార్థులు.. నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. విద్యార్థుల సమస్యలు మంత్రి నారా లోకేష్ కళ్ళకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. తక్షణమే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని.. లేకపోతే వైస్సార్సీపీ తమ పోరాటాన్ని ఉధృతం చేస్తుందన్నారు.

వైసీపీ విద్యార్థి విభాగం నగర అధ్యక్షులు చంద్రారెడ్డి మాట్లాడుతూ....

మెగా డీఎస్సీలో చోటుచేసుకున్న అవినీతి అక్రమాలతో.. లక్షలాది మంది నిరుద్యోగులు నష్టపోయారని అన్నారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయడంతో పాటు.. దీనిపై వైఎస్ఆర్సిపి డిమాండ్ చేసిన విధంగా సిబిఐ జరిపించాలని కోరారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE

Next Story