Nellore: ఆలయంలో ఘర్షణ.. సీసీ కెమెరా హార్డ్ డిస్క్‌లు మాయం?

Nellore: కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నేతృత్వంలో అరాచకాలు పెరిగిపోయాయని వైసీపీ నేతలు విమర్శించారు.

V. Narasimhulu, Nellore
Published on: 25 April 2026 8:30 PM IST
Nellore
X

Nellore: ఆలయంలో ఘర్షణ.. సీసీ కెమెరా హార్డ్ డిస్క్‌లు మాయం?

Nellore: కోవూరు నియోజకవర్గంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే అసలు ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతుందని కోవూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

శనివారం జిల్లా పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మండల కన్వీనర్ అనూప్ రెడ్డి, బుచ్చి రెడ్డిపాలెం కన్వీనర్ సతీష్ రెడ్డి, కొడవలూరు కన్వీనర్ శేషగిరి రావు,జిల్లా రైతువిభాగం అధ్యక్షులు నరసింహ రెడ్డి, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున రెడ్డి, కార్యదర్శి ప్రసాద్ రెడ్డి, zptc శ్రీలత, మాజీసర్పంచ్ ఉమా, జనార్దన్, చెంచురెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

ఎమ్మెల్యే సమక్షంలో భక్తులు దేవాలయంలో ఉండగా వారి సమక్షంలో కొట్టుకునే సంస్కృతి నియోజకవర్గంలో మొదటిసారి చూస్తున్నామన్నారు. ఆ వీడియోలు ఎక్కడ బయటపడి వైరల్ అవుతాయని భక్తులను చెదరగొట్టారని అన్నారు. వెంటనే సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ ని తీసుకువెళ్లారన్నారు. ఈ విషయంపై నిర్వాహకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడారన్నారు.

ఎమ్మెల్యేకు అధికారం ఇచ్చింది ప్రజలకు పరిపాలన చేయమని అంతేగాని, ప్రశ్నిస్తే కేసులు పెట్టడం జైలుకు పంపడం తప్ప ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కోవూరు నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదన్నారు. కోవూరు పంచాయతీ కార్యదర్శి అనేక అక్రమాలకు, అవకతవకలకు పాల్పడుతుంటే ఎమ్మెల్యే దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారన్నారు. ఈ రెండు ఏళ్లలో కోవూరు నియోజకవర్గంలో ఎప్పుడూ జరగని సంఘటనలు చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

పంచాయతీలో నీళ్లు రాలేదు అని కార్యదర్శిని అడిగితే మహిళలను ఇష్టం వచ్చినట్లు మాట్లాడారన్నారు. పంచాయతీ కార్యదర్శి ఎక్కడ పనిచేసిన ప్రతి కార్యాలయంలో రికార్డులను మాయం చేయడంలో దిట్ట అన్నారు. ఎమ్మెల్యేకు తప్పుడు సమాచారం పంపి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆయంలో 150 కోట్లు పెట్టి సచివాలయం నిర్మించామని, వాటిలో పది శాతం ఏదైనా అభివృద్ధికి ఖర్చు పెట్టారా అని నిలదీశారు.

కోవూరులో రౌడీయిజం, గుండాయిజం, మాదకద్రవ్యాలు వాడకం విపరీతంగా పెరిగిపోయిందన్నారు. జగన్ మోహన్ రెడ్డి చెప్పిన సంక్షేమ పథకాలు పూర్తిగా అమలు చేశారని, మీరు చెప్పినవి అమలు చేశారని గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ని కోరారు. ప్రజల కోసం వైఎస్ఆర్సిపి నాయకులు గానీ, కార్యకర్తలు గానీ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటామని తెలిపారు. తప్పులు సరిదిద్దుకోకపోతే ఎమ్మెల్యేకు ప్రజలు బుద్ధి చెప్తారని పేర్కొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story