Nellore: దిశా రద్దు.. మహిళలకు ముప్పు: విఆర్ సి కూడలి వద్ద వైఎస్సార్‌సీపీ నిరసన

Nellore: నెల్లూరు విఆర్ సి కూడలి వద్ద వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో దిశా చట్టం రద్దును నిరసిస్తూ ధర్నా నిర్వహించారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 7 Aug 2026 11:48 PM IST
Nellore
X

Nellore: దిశా రద్దు.. మహిళలకు ముప్పు: విఆర్ సి కూడలి వద్ద వైఎస్సార్‌సీపీ నిరసన

నెల్లూరు నగరంలోని విఆర్ సి కూడలి వద్ద “దిశా రద్దు.. మహిళలకు ముప్పు.. “పేరిట , దిశా చట్టాన్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ, జిల్లాపరిషత్ అధ్యక్షులు శ్రీమతి ఆనం అరుణమ్మ ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలతో కలిసి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించి, నిరసన తెలియజేశారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత, ఈ సందర్భంగా పూజిత గారు మాట్లాడుతూ గతంలో జగనన్న ప్రభుత్వ హయాంలో మహిళల రక్షణ కోసం తీసుకొచ్చిన "దిశా చట్టం" యొక్క ప్రాధాన్యతను, ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని వివరించారు.

"దిశా చట్టం విశిష్టత"

గత ప్రభుత్వంలో మహిళలు, పిల్లలపై ఎలాంటి అన్యాయం లేదా అఘాయిత్యం, జరిగినా నిర్ణీత సమయానికే (టైమ్ పీరియడ్ లోపల) విచారణ పూర్తి చేసి, దోషులకు కఠిన శిక్ష పడేలా దిశా చట్టాన్ని తీసుకొచ్చారని ఆమె గుర్తుచేేశారు. ఒకసారి నేరానికి పాల్పడినవారు మళ్లీ అటువంటి వికృత చర్యలకు ఒడిగట్టకుండా, మహిళలకు పూర్తి భరోసా కల్పించడమే దిశా చట్టం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

"వ్యవస్థల బలోపేతం"

దిశా చట్టం అమలు కోసం ప్రత్యేకంగా దిశా పోలీస్ స్టేషన్లు, దిశా మొబైల్ పెట్రోలింగ్ వాహనాలు, ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడమే కాకుండా, విచారణను వేగవంతం చేసేందుకు అవసరమైన ఫోరెన్సిక్ నిపుణులను కూడా అందుబాటులోకి తెచ్చారని పేర్కొన్నారు.

"కక్ష పూరిత రాజకీయం"

జగనన్నకు మహిళల పట్ల ఉన్న గౌరవంతో మహిళలకు అత్యున్నత స్థాయి రక్షణ కల్పించారని అన్నారు. అయితే, ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు "దిశా చట్టం" ద్వారా జగనన్నకు మంచి పేరు వస్తుందనే ఒకే ఒక్క కక్షతో మహిళా భద్రతను పూర్తిగా గాలికి వదిలేశారని విమర్శించారు.

జగనన్నకు ఎక్కడ మంచి పేరు వస్తుందో అనే భయంతోనే మంచి కార్యక్రమాలను కూడా నిలిపివేస్తున్నారని, దీనివల్ల మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును చెరిపేసేందుకు మాత్రమే కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆమె తీవ్రంగా ఆరోపించారు..

"దిశా చట్టాన్ని పక్కన పెట్టడం దారుణం"

వైఎస్సార్‌సీపీ నాయకురాలు కాకాణి పూజిత మండిపాటు మహిళల భద్రత కోసం గత ప్రభుత్వం తీసుకొచ్చిన "దిశా చట్టం" ప్రాధాన్యతను తగ్గించేలా ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తుండటంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కాకాణి పూజిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుందనే కక్షతోనే ఈ చట్టాన్ని పక్కన పెట్టారని విమర్శించారు.

"దేశానికే ఆదర్శంగా దిశా చట్టం"

దిశా చట్టం అమలులోకి వచ్చినప్పుడు దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా దీనిపై ప్రశంసలు కురిపించాయని, తమ రాష్ట్రాల్లోనూ ఇలాంటి చట్టాన్ని తీసుకువస్తామని ప్రకటించాయని పూజిత గుర్తుచేశారు. అటువంటి చట్టాన్ని నిర్వీర్యం చేయడం సరికాదని పేర్కొన్నారు.

"కక్ష పూరిత నిర్ణయాలు" మహిళలకు ప్రత్యేక రక్షణ, అదనపు భద్రత ఉంటే ప్రభుత్వానికి వచ్చిన అభ్యంతరం ఏమిటని ఆమె ప్రశ్నించారు. దిశా చట్టం వల్ల ఏ ఒక్క మహిళకైనా అన్యాయం జరిగిందా? అని నిలదీశారు. తమ పార్టీ కార్యకర్తలను, నేతలను కేసుల నుంచి కాపాడుకోవడానికే ఈ చట్టాన్ని రద్దు చేసేందుకు లేదా పక్కన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

"మహిళలకు పెరిగిన ధైర్యం"

దిశా యాప్, దిశా పెట్రోలింగ్ వాహనాలు మరియు దిశా పోలీస్ స్టేషన్ల ద్వారా అర్ధరాత్రి వేళల్లో కూడా వేలాది మంది మహిళలు సురక్షితంగా ఇళ్లకు చేరారని, భయం లేని వాతావరణం ఏర్పడిందని తెలిపారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడం కూడా మహిళలకు చాలా సులభతరమైందని చెప్పారు.

"రక్షణ వ్యవస్థలపై ప్రభావం"

మహిళలు, పిల్లలపై అన్యాయం జరిగినప్పుడు బాధితులకు న్యాయం చేయడం ఎంత కష్టమో, వారి తరఫున నిలబడటం ఎంత అవసరమో అధికారంలో ఉన్నవారు గుర్తించాలని హితవు పలికారు. కూటమి ప్రభుత్వ నిర్ణయాల వల్ల మహిళల రక్షణ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు

"దిశా చట్టాన్ని పక్కన పెట్టడం తీవ్ర అన్యాయం"

మహిళల భద్రత కోసం గత జగనన్న ప్రభుత్వం తీసుకొచ్చిన "దిశా చట్టాన్ని" కావాలని పక్కన పెట్టడం చాలా అన్యాయమని పూజిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేవలం తమ రాజకీయ అజెండాను నెరవేర్చుకోవడానికే ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఒక చట్టం రద్దయినంత మాత్రాన నష్టం ఆగదని, ప్రభుత్వ నిర్ణయాల వల్ల వ్యవస్థలపై మహిళలకు ఉన్న నమ్మకమే చచ్చిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల ముందు పెద్ద పెద్ద మాటలు చెప్పిన వారు.. జగనన్న చేతల్లో చేసి చూపించిన రక్షణ చర్యలను వెనక్కి తీసుకోవడం సిగ్గుపడాల్సిన విషయమని పేర్కొన్నారు.

రాష్ట్రంలో మహిళలకు ప్రత్యేక రక్షణ అవసరం లేదనే విధంగా సాక్షాత్తూ హోం మంత్రి మాట్లాడటం దారుణమని విమర్శించారు. చట్టాలపై అవగాహన లేకుండా, హేళనగా మాట్లాడటం మహిళల భద్రతను విస్మరించడమేనని అన్నారు. హోం మంత్రి అనిత పెద్ద పెద్ద మాటలు మాట్లాడి, ఇప్పుడు రక్షణ చర్యలను వెనక్కి తీసుకోవడం ఎంత తప్పో వారి స్థానాల్లో ఉండి ఒకసారి ఆలోచించుకోవాలని హితవు పలికారు. మహిళల భద్రతను రాజకీయం చేయకుండా, వెంటనే తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దిశా చట్టాన్ని, దిశా పోలీస్ స్టేషన్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మునుపటిలాగే కొనసాగించేలా ప్రభుత్వం తక్షణమే తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE

Next Story