Nellore: కలిగిరి శివాలయానికి చేజర్ల సుబ్బారెడ్డి భారీ విరాళం!

Nellore: నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో నిర్మాణంలో ఉన్న నూతన శివాలయానికి వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి చేజర్ల సుబ్బారెడ్డి రూ.2,00,116 విరాళం ప్రకటించారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 14 July 2026 1:46 PM IST
Nellore
X

Nellore: కలిగిరి శివాలయానికి చేజర్ల సుబ్బారెడ్డి భారీ విరాళం!

కలిగిరి: కలిగిరి మండలంలో నిర్మాణంలో ఉన్న నూతన శివాలయానికి వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి చేజర్ల సుబ్బారెడ్డి రూ.2,00,116 విరాళాన్ని ప్రకటించారు. కలిగిరి జడ్పీటీసీ పోలూరు మాల్యాద్రి రెడ్డి విజ్ఞప్తి మేరకు ఆలయ నిర్మాణ స్థలాన్ని సందర్శించిన ఆయన, అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి తన వంతు సహాయంగా ఈ విరాళాన్ని ప్రకటించారు.

ఈ సందర్భంగా చేజర్ల సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధి సమాజంలో ఐక్యత, సాంస్కృతిక విలువలను పెంపొందిస్తుందని అన్నారు. ప్రజల సహకారంతో శివాలయ నిర్మాణం త్వరగా పూర్తై భక్తులకు అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు. సామాజిక సేవలో ముందుండే నాయకుడిగా పేరుగాంచిన చేజర్ల సుబ్బారెడ్డి విద్య, వైద్యం, పేదల సంక్షేమంతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా నిరంతరం చేయూత అందిస్తున్నారని స్థానికులు కొనియాడారు.

శివాలయ నిర్మాణానికి ఆయన ప్రకటించిన విరాళం భక్తి, సేవాభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలిగిరి జడ్పీటీసీ పోలూరు మాల్యాద్రి రెడ్డి, గణపం రమేష్, బాలిబోయిన శ్రీనివాస్ యాదవ్, చేజర్ల సుధాకర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు, స్థానికులు పాల్గొన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story