Nellore: నెల్లూరు డివిజన్ల అస్తవ్యస్త విభజనపై కమిషనర్‌కు వినతి!

Nellore: మున్సిపల్ డివిజన్ల అస్తవ్యస్త విభజనపై కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున్ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నేతలు కమిషనర్ నందన్‌కు వినతిపత్రం ఇచ్చి లోపాలు సరిదిద్దాలని కోరారు.

A Praveen, Nellore
Published on: 8 Sept 2026 7:01 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు డివిజన్ల అస్తవ్యస్త విభజనపై కమిషనర్‌కు వినతి!

నెల్లూరు: నెల్లూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ల విభజన ముసాయిదా లో జరిగిన అస్తవ్యస్త విభజన గురించి నేడు నెల్లూరు మున్సిపల్ కమీషనర్ నందన్ గారిని యువనాయకుడు మరియు 13వ డివిజన్ కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు శ్రీ వేనాటి శ్రీకాంత్ రెడ్డి, నీలి రాఘవరావు, కామాక్షి దేవి, రియాజ్ మరియు కాయల సురేష్ గార్లతో కలసి అభ్యంతరాలను వ్యక్తం చేసి వినతి పత్రం ఇచ్చి ముసాయిదా డివిజన్ల విభజన లో జరిగిన లోపాలను సరిదిద్దవలసినదిగా కోరడం జరిగింది.

ఈ సందర్భంగా ఊటుకూరు నాగార్జున్ మాట్లాడుతూ ఏమి చేసైనా ఎన్నికలలో గెలవాలనే ప్రయత్నంలో భాగంగానే అధికార పార్టీ ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. మంత్రి నారాయణ గారు కానీ కూటమి నాయకులు కానీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చెప్పుకోడానికి ఏమీ లేక, జనం దగ్గరికి పొతే ఛీ కొడతారని ఎన్నికలలో గెలవడానికి ఇలాంటి దొంగ దారులు వెతుకుతున్నారుఅన్నారు.

13 వ డివిజన్ గురించే తీసుకొంటే దానిని అడ్డదిడ్డంగా చీల్చి పాత 13 వ డివిజన్ కి అటు ఇటు వుండే డివిజన్ లలో అక్కడో ముక్క ఇక్కడో ముక్క అతికించి అతుకుల బొంత చేయడమే కాదు ప్రమాదకరమైన 3 జాతీయ రహదారి కూడళ్లను ఈ డివిజన్లో పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. 35 సంవత్సరాలుగా ఒకటిగా వున్నా ఎన్టీఆర్ నగర్ ను ముక్కలు చేసి ఆ ప్రాంత వాసుల మనోభావాలు దెబ్బ తీశారు.

ఇలా చెప్పుకొంటూ పొతే అధికారమే పరమావధిగా చేసిన ప్రయత్నమే ఈ అస్తవ్యస్త విభజన అని అర్ధమవుతోంది. ఈ విషయం లో న్యాయం జరిగేవరకు చట్టపరంగా కానీ రాజకీయంగా కానీ ఎంత వరకూ అయినా పోరాడటానికి వెనకడుగు వేసే ప్రసక్తి లేదని తెలిపిన నాయకులు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

A Praveen, Nellore

A Praveen, Nellore

Next Story