Atmakur: ఆత్మకూరులో వైఎస్సార్‌ 17వ వర్ధంతి: రోగులకు పండ్లు పంపిణీ!

Atmakur: ఆత్మకూరులో దివంగత సీఎం వైఎస్సార్‌ 17వ వర్ధంతి ఘనంగా జరిగింది. మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి సూచనలతో ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 2 Sept 2026 7:01 PM IST
Atmakur
X

Atmakur: ఆత్మకూరులో వైఎస్సార్‌ 17వ వర్ధంతి: రోగులకు పండ్లు పంపిణీ!

ఆత్మకూరు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ జనహృదయ నేతగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని పలువురు వక్తలు అన్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో లక్షలాది మంది పేదలు లబ్ధి పొందారని పేర్కొన్నారు.

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి సూచనల మేరకు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు.పట్టణంలోని ఎంజీఆర్‌ మున్సిపల్‌ బస్టాండ్‌ ప్రాంగణంలోని వైఎస్సార్‌ విగ్రహానికి నాయకులు,కార్యకర్తలు భారీ పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్‌ సీహెచ్‌ ఆదిశేషయ్య, ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి కొండా వెంకటేశ్వర్లు, పట్టణ పార్టీ అధ్యక్షుడు నాగలపాటి ప్రతాప్‌రెడ్డి తదితరులు మాట్లాడుతూ.. వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా పేదలు, రైతులు, విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు.

వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం పేదలకు మెరుగైన వైద్యం అందించడంలో కీలకపాత్ర పోషించిందన్నారు. అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడేందుకు ప్రవేశపెట్టిన 108 అత్యవసర సేవలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా నిలిచాయని చెప్పారు. మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్‌, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి కార్యక్రమాలతో వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో స్థిరపడ్డారని పేర్కొన్నారు.

జలయజ్ఞం ద్వారా సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చి లక్షలాది ఎకరాలను సాగులోకి తీసుకురావడానికి వైఎస్సార్‌ కృషి చేశారని వక్తలు గుర్తుచేశారు. రైతులకు ఉచిత విద్యుత్‌ అందించేందుకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తొలి సంతకం చేసిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందని అన్నారు.

ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర నిర్వహించిన వైఎస్సార్‌.. పేదలు, రైతులు, సామాన్యుల కష్టాలను దగ్గరగా చూశారని తెలిపారు. ప్రజల పట్ల ఆయన చూపిన అభిమానం, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల కారణంగానే నేటికీ ప్రజలు ఆయనను స్మరించుకుంటున్నారని అన్నారు.

రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ

వైఎస్సార్‌ వర్ధంతిని పురస్కరించుకుని ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిరణ్‌, గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ శ్రీవాణి చేతుల మీదుగా రోగులకు పండ్లు, బ్రెడ్లు అందజేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ మున్సిపల్‌ శాఖ కార్యదర్శి అల్లారెడ్డి ఆనంద్‌రెడ్డి, పీఆర్‌ విభాగం అధ్యక్షుడు బొమ్మిరెడ్డి రవికుమార్‌రెడ్డి, ఎస్సీ సెల్‌ నాయకుడు తోడేటి అశోక్‌,

నోటి వినయ్‌కుమార్‌రెడ్డి, షేక్‌ రహీం, మీరా మొహిద్దీన్‌, జమ్రు, తోడేటి మణి, పి.వెంగళరెడ్డి, చెన్నకేశవులు, బేకరి మస్తాన్‌, బి.వెంకటరెడ్డి, పద్మనాభరెడ్డి, సురేంద్రరెడ్డి, గడ్డం శ్రీనివాసులురెడ్డి, పూనూరు రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.మహిళా నాయకులు షేక్‌ పర్వీన్‌, కల్పనారెడ్డి, సుజాతతో పాటు విష్ణువర్ధన్‌రెడ్డి, ఎన్‌.ప్రతాప్‌, వాశిలి శ్రీహరి, కె.చిన వెంకటేశ్వర్లు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story