Nellore: నవలాకుల గార్డెన్స్ వద్ద చందు అనే యువకుడు విగతజీవిగా గుర్తింపు!
Nellore: నెల్లూరు రూరల్ నవలాకుల గార్డెన్స్ వద్ద చందు (23) అనే యువకుడు దారుణ హత్య.. స్నేహితులతో వెళ్లిన యువకుడు విగతజీవిగా మారిన వైనంపై పోలీసుల దర్యాప్తు.
Nellore: నవలాకుల గార్డెన్స్ వద్ద చందు అనే యువకుడు విగతజీవిగా గుర్తింపు!
Nellore: నవలాకుల గార్డెన్స్ నాలుగో మైలు ప్రాంతంలోని ఎస్‌ఎల్‌ఎస్ పవర్ ప్లాంట్ సమీపంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. స్థానికంగా లభించిన సమాచారం మేరకు చందు (23) అనే యువకుడు ఈ ఘటనలో మృతిచెందినట్లు తెలుస్తోంది.
చందు గత వారం రోజుల క్రితమే చెన్నై నుంచి నెల్లూరుకు వచ్చినట్లు సమాచారం. శుక్రవారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన అనంతరం అతడు హత్యకు గురైనట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే హత్యకు గల కారణాలు, నిందితులు ఎవరన్నది ఇంకా తెలియాల్సి ఉంది.
సమాచారం అందుకున్న నెల్లూరు రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. చందుతో చివరిగా ఎవరెవరు ఉన్నారు? హత్యకు దారితీసిన పరిస్థితులేమిటి? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.




