Nellore: కావలి కాలువలో స్నానానికి దిగిన యువకుడు గల్లంతు.. గాలింపు చర్యలు!
Nellore: నెల్లూరు జిల్లా సంగం సమీపంలోని కావలి కాలువలో స్నానానికి దిగి మోహన్ అనే యువకుడు గల్లంతయ్యాడు.
Nellore: కావలి కాలువలో స్నానానికి దిగిన యువకుడు గల్లంతు.. గాలింపు చర్యలు!
నెల్లూరు జిల్లా: సంగం సమీపంలోని కావలి కాలువలో స్నానానికి దిగిన ఓ యువకుడు గల్లంతైన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. గుంటూరుకు చెందిన మోహన్, ఇబ్రహీం పరిసర ప్రాంతాల్లో దుకాణాలకు నేమ్‌బోర్డులు బిగించి తిరిగి వెళ్ళే క్రమంలో స్నానం చేసేందుకు కావలి కాలువ వద్దకు వెళ్లారు.
ఇద్దరూ కాలువలో స్నానానికి దిగగా ఇద్దరూ గల్లంతయ్యారు. ఇబ్రహీం ఈత కొట్టి సురక్షితంగా గట్టుకు చేరుకున్నాడు. అయితే మోహన్ మాత్రం నీటిలో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న ఎస్సై భోజ్యా నాయక్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. గల్లంతైన మోహన్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story




