Kovur: పాటూరు ప్రశాంతతకు భంగం కలిగిస్తే ఊరుకోం వైసీపీ నేత!

Kovur: కోవూరు నియోజకవర్గం పాటూరు గ్రామంలో ప్రశాంతతకు భంగం కలిగిస్తే సహించేది లేదని వైసీపీ సీనియర్ నేత యద్రెడ్డి ఆదినారాయణరెడ్డి హెచ్చరించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 5 Aug 2026 7:32 AM IST
Kovur
X

Kovur: పాటూరు ప్రశాంతతకు భంగం కలిగిస్తే ఊరుకోం వైసీపీ నేత!

Kovur: "పాటూరు ప్రశాంతతకు భంగం కలిగించొద్దు"

కోవూరు నియోజకవర్గం పాటూరు గ్రామంలో రాజకీయ వేడి!

ప్రశాంత గ్రామంలో చిచ్చు పెడుతున్నారంటూ వైసీపీ ఆగ్రహం!

ప్రశాంతకు మారుపేరుగా ఉన్న కోవూరు నియోజకవర్గం పాటూరు గ్రామంలో ఇప్పుడు రాజకీయ చిచ్చు రాజుకునే ప్రమాదం కనిపిస్తోంది.

పక్క గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు గ్రామంలోకి వచ్చి విభేదాలు సృష్టిస్తున్నారని పాటూరు వైసీపీ సీనియర్ నేత యద్రెడ్డి ఆదినారాయణరెడ్డి తీవ్రంగా ఆరోపించారు.

మంగళవారం పాటూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించే తాము మాట్లాడుతున్నామని, ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించడం లేదని స్పష్టం చేశారు.

కానీ కొందరు నాయకులు మాత్రం గ్రామాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని, ప్రజల్లో అపోహలు కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

పాటూరు గ్రామ ప్రజలు ఎప్పటి నుంచో కలిసిమెలిసి ప్రశాంతంగా జీవిస్తున్నారని, అలాంటి గ్రామంలోకి వచ్చి రాజకీయ లబ్ధి కోసం వివాదాలు సృష్టించడం సరికాదని ఆయన హితవు పలికారు.

గతంలో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధిని విమర్శించే స్థాయి పక్క గ్రామాల టీడీపీ నేతలకు లేదని ఎద్దేవా చేశారు.

గ్రామాభివృద్ధిపై చర్చకు ఎప్పుడూ సిద్ధమని, కానీ అసత్య ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తే సహించబోమని హెచ్చరించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story