Nellore: అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి: కర్నాటి
Nellore: కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యక్తిగత విమర్శలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని కర్నాటి డిమాండ్ చేశారు.
Nellore: అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి: కర్నాటి
Nellore: నెల్లూరు జిల్లా రాజకీయాల్లో గత 45 ఏళ్లుగా కొనసాగుతున్న తన రాజకీయ ప్రస్థానంలో ఇలాంటి వ్యక్తిగత విమర్శలు ఎన్నడూ వినలేదని మీడియా ప్యానల్ లిస్ట్ కర్నాటి ఆంజనేయులు రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డిపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఉన్నత చదువులు చదివిన మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ రాజకీయ విమర్శలు చెయ్యవచ్చు, అయితే వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదని ఆంజనేయులు రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా ఒక మహిళా శాసనసభ్యురాలిపై వ్యక్తిగతంగా, కొప్పుపై వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు.
రాజకీయంగా ఎవరినైనా ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, అదే విధంగా తాను కూడా రూప్ కుమార్ యాదవ్ నీ డిమాండ్ చేశారు ఆంజనేయులు రెడ్డి. అనిల్‌కుమార్ యాదవ్ రూప్ కుమార్ యాదవ్ పై చేసిన ఆరోపణలని సమర్థించారు, అయితే రూప్ కుమార్ యాదవ్ చైనా పర్యటనకు మేయర్ హోదాలో వెళ్లారా? లేదా? అనే విషయాన్ని ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రాజకీయాల్లో ఆరోగ్యకరమైన విమర్శలు ఉండాలని, వ్యక్తిగత దూషణలకు తావు ఇవ్వకూడదని ఆంజనేయులు రెడ్డి సూచించారు.




