Nellore: వింజేటమ్మకొండ వద్ద శ్రీకాంత్ హత్య కేసు ఛేదించిన పోలీసులు!
Nellore: నెల్లూరు జిల్లా వింజమూరు మండలం వింజేటమ్మకొండ వద్ద ఈ నెల 16న జరిగిన మేదరమెట్ల శ్రీకాంత్ (32) హత్య కేసును పోలీసులు ఛేదించారు.
Nellore: వింజేటమ్మకొండ వద్ద శ్రీకాంత్ హత్య కేసు ఛేదించిన పోలీసులు!
నెల్లూరు: వింజమూరు మండల సమీపంలోని వింజేటమ్మకొండ వద్ద ఈ నెల 16న హత్యకు గురైన మేదరమెట్ల శ్రీకాంత్(32) హత్య కేసును పోలీసులు ఛేదించారు.వివాహేతర సంబంధమే హత్యకు కారణమని కలిగిరి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సుబ్బారావు విలేకరుల సమావేశంలో వెల్లడించారు.ఈ కేసులో హరిబాబు, ప్రదీప్, వెంగమ్మలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
పథకం ప్రకారం వెంగమ్మ శ్రీకాంత్‌ను వింజేటమ్మకొండ సమీపానికి రమ్మని పిలిచిందని, అక్కడ ముందుగానే ఉన్న హరిబాబు, ప్రదీప్ కలిసి శ్రీకాంత్‌పై దాడి చేసి అనంతరం కత్తితో పొడిచి హత్య చేసినట్లు వివరించారు.అనంతరం అనుమానం రాకుండా మృతదేహాన్ని ముళ్లపొదల్లో పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిపారు.
జిల్లా ఎస్పీ అజితా వెజెండ్ల ఆదేశాల మేరకు వింజమూరు ఎస్సై ఉమా మహేశ్వరరావు, కలిగిరి ఎస్సై ఉమాశంకర్ ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బృందాలు ఏర్పడి కేసును ఛేదించినట్లు సీఐ తెలిపారు.ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.




