Vinjamur: వింజమూరు ఎస్టీ కాలనీలో పోలీసుల కార్డెన్ సెర్చ్!

Vinjamur: నెల్లూరు జిల్లా వింజమూరు జి.బి.కె.ఆర్ ఎస్టీ కాలనీలో సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్. 33 బైక్‌లు, 3 ఆటోలు తనిఖీ చేసిన పోలీసులు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 13 Sept 2026 1:44 PM IST
Vinjamur
X

Vinjamur: వింజమూరు ఎస్టీ కాలనీలో పోలీసుల కార్డెన్ సెర్చ్!

Vinjamur: నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని జి.బి.కె.ఆర్ ఎస్టీ కాలనీలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. కలిగిరి సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీల్లో కలిగిరి సర్కిల్ పరిధిలోని సుమారు 35 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

కలిగిరి,వింజమూరు,కొండాపురం ఎస్సైల నేతృత్వంలో పోలీసులు కాలనీలోని ఇళ్లు,పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా 33 బైక్‌లు, మూడు ఆటోలను తనిఖీ చేశారు.కాలనీలో శాంతిభద్రతలను పరిరక్షించడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు ముందస్తు చర్యల్లో భాగంగానే కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ తనిఖీల్లో వింజమూరు ఎస్సై ఉమామహేశ్వరరావు,కలిగిరి ఎస్సై , కొండాపురం ఎస్సై శ్రీనివాసులు,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్